AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yo Yo Honey Singh: యో యో హనీ సింగ్ కేసులో ట్విస్ట్.. భారీగా పరిహారం కోరుతున్న సింగర్ భార్య.. ఎంతంటే..

బాలీవుడ్ సింగర్ యోయో హనీ సింగ్ పై అతడి భార్య షాలిని తల్వార్ గృహ హింస కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తనను హనీ సింగ్ మానసికంగా,

Yo Yo Honey Singh: యో యో హనీ సింగ్ కేసులో ట్విస్ట్.. భారీగా పరిహారం కోరుతున్న సింగర్ భార్య.. ఎంతంటే..
Yoyo Honey Singh
Rajitha Chanti
|

Updated on: Aug 05, 2021 | 1:49 PM

Share

బాలీవుడ్ సింగర్ యోయో హనీ సింగ్ పై అతడి భార్య షాలిని తల్వార్ గృహ హింస కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తనను హనీ సింగ్ మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా వేధింపులకు గురిచేసాడని ఢిల్లీలోని తిస్ హజారీ కోర్టులో ఆమె ఫిర్యాదు చేసింది. ఇక షాలిని తల్వార్ ఫిర్యాదుతో యో యో హనీ సింగ్ పై హజారీ కోర్టులో గృహ హింస చట్టం కింద కేసు నమోదైంది. దీంతో వివరణ ఇవ్వాలని కోర్టు అతడికి నోటీసులు పంపింది. అంతేకాకుండా.. హనీసింగ్‏కు చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని.. హనీ సింగ్ తన కుటుంబసభ్యులతో కలిసి తనను తీవ్రంగా వేధించాడని సంచలన ఆరోపణలు చేసింది షాలిని తల్వార్.

తాజాగా యోయో హనీ సింగ్ నుంచి తనకు భారీగా పరిహారం ఇప్పించాలని అతడి భార్య షాలిని తల్వార్ కోర్టును కోరినట్లుగా సమాచారం. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికలో వచ్చిన సమాచారం ప్రకారం.. తనను అనేక ఆర్థికంగా, మానసికంగా వేధించిన హనీ సింగ్ నుంచి తనకు రూ.10 కోట్ల పరిహారం ఇప్పించాలని షాలిని తల్వార్ కోర్టును కోరారట. అలాగే నోయిడాలో సంయుక్తంగా నిర్వహించే యాజమాన్యంలో ఉన్న ఆస్తిలో మూడవ వ్యక్తిని ఇవ్వకూడదని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ తానియా సింగ్‏కు నోటీసులు జారీ చేసినట్లుగా షాలిని తరపు న్యాయవాది తెలిపారు. అలాగే ప్రస్తుతం తనకు ఢిల్లీలో ఉన్న వసతి కోసం హనీ సింగ్ ప్రతి నెల రూ. 5 లక్షలు అద్దె చెల్లించాలని షాలిని కోర్టును కోరింది. ఇది పరిహరం ఇవ్వడం వలన తన తల్లిపై ఆధార పడకుండా.. స్వయంగా జీవించగలనని తెలిపింది.

గత పది సంవత్సరాలుగా హనీ సింగ్ తనను శారీరకంగా హింసించాడని.. కేవలం తనను ఒక వస్తువుగా మాత్రమే చూసేవాడని షాలిని పిటిషన్‏లో తెలిపింది. గృహసింగ చట్టం కింద కేసు నమోదు చేసి అతడినికి నోటీసులు ఇవ్వాలని షాలిని కోరింది. తనను గృహహింసకు గురిచేసిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయని.. తనకు వివాహం కాలేదని చెప్పుకునే వాడని.. కానీ తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినందకు తనను తీవ్రంగా కొట్టాడని షాలిని ఫిర్యాదులో పేర్కోంది. హనీసింగ్ వలన తను ఇప్పటికీ డిప్రెషన్ లక్షణాలతో బాధపడుతున్నానని.. ప్రస్తుతం ఇందుకు వైద్యం తీసుకుంటున్నట్లుగా తెలిపింది.

ఇదిలా ఉంటే..బాలీవుడ్‏లో ప్రాజెక్ట్స్ రాకముందే హనీసింగ్‏కు పెళ్లి జరిగింది. 2011లో జనవరి 23న హనీసింగ్… షాలిని తల్వార్‏ను వివాహం చేసుకున్నాడు. 2014లో ఓ రియాలిటీ షో ద్వారా తన భార్యను హనీసింగ్ అందరికి పరిచయం చేశాడు.

Also Read: Kajol Birthday: అందానికి చిరునామా కాజోల్.. హీరోయిన్‏గానే కాదు.. విలన్‏గానూ అదుర్స్.. బర్త్ డే వేళ ఆసక్తికర విషయాలు..

Genelia D’Souza: జెనీలియా.. రితేష్ తమ ప్రేమను ఎన్ని సంవత్సరాలు రహస్యంగా ఉంచారో తెలుసా..

Thamannah: తమన్నా ఆరాటం.. మిల్కీ బ్యూటీ సాహసం మాములుగా లేదుగా.. అభినందిస్తున్న నెటిజన్స్..

నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..