నా భర్తకు చాలామంది మహిళలతో ఎఫైర్లు ఉన్నాయి.. సంచలన ఆరోపణలు చేసిన ప్రముఖ సింగర్ భార్య..

yo yo honey singh: బాలీవుడ్ చీకటి కోణాలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి. ఇప్పటికే యాక్టింగ్ ఛాన్స్ కోసం వచ్చిన యువతులతో బలవంతంగా నీలిచిత్రాలు

నా భర్తకు చాలామంది మహిళలతో ఎఫైర్లు ఉన్నాయి.. సంచలన ఆరోపణలు చేసిన ప్రముఖ  సింగర్ భార్య..
Yo Yo Honey Singh Wife

Updated on: Aug 04, 2021 | 3:23 PM

yo yo honey singh: బాలీవుడ్ చీకటి కోణాలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి. ఇప్పటికే యాక్టింగ్ ఛాన్స్ కోసం వచ్చిన యువతులతో బలవంతంగా నీలిచిత్రాలు తెరకెక్కిస్తున్నారంటూ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అరెస్ట్‌‌‌తో అతడి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో వ్యవహారం ఇప్పుడు బాలీవుడ్‌‌‌‌ను షేక్ చేస్తోంది. ఈ సారి ప్రముఖ సింగర్ హనీసింగ్ హాట్ టాపిక్ అయ్యారు. పాప్ సాంగ్స్‌‌‌‌తో చాలా పాపులర్ అయిన హనీసింగ్ పై ఆయన భార్య షాలిని తల్వార్ గృహహింస, లైంగిక వేధింపులు ఆరోపణలు చేశారు. ఆమె ఢిల్లీలోని తిస్ హజారీ కోర్టులో ‘గృహ హింస నుంచి మహిళల రక్షణ చట్టం’ కింద మంగళవారం పిటీషన్ దాఖలు చేశారు. అయితే హనీసింగ్ తనకు పెళ్లైందన్న విష్యాయాన్ని చాలా గోప్యంగా ఉంచాడు. బాలీవుడ్‌‌‌‌లో ఆయనకు పెద్ద ప్రాజెక్ట్స్ రాకముందే అతడికి వివాహం అయ్యిందని తెలిసి అంతా షాక్ అయ్యారు. అయితే 2014లో ఓ రియాలిటీ షో ద్వారా తన భార్యను హనీసింగ్ అందరికి పరిచయం చేశాడు.

 

 

అయితే  తన పై శారీరకంగా దాడి చేశారని మానసికంగా హింసించారని షాలిని ఆరోపించింది. యో యో హనీ సింగ్ అసలు పేరు హిర్దేశ్ సింగ్. హిర్దేష్ తన తల్లిదండ్రులు – చెల్లెలుతో కలిసి తనను వేధించాడని ఆమె పేర్కొన్నారు. మద్యానికి బానిసవ్వడంతోపాటు.. వ్యభిచారం ఆరోపణలు కూడా చేశారు ఆమె. అలాగే అతనికి చాలా మంది మహిళలతో సంబంధాలున్నాయని ఆమె తన పీటీషన్ లో పేర్కొంది. ఇక ఈ వ్యవహారం పై హనీసింగ్ ఇంతవరకు స్పందించలేదు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ritu Varma: దిగు దిగు దిగు నాగ అంటూ.. మాస్ స్టెప్పులతో కవ్విస్తున్న తెలుగమ్మాయి.. ‘వరుడు కావలెను’నుంచి మరో సాంగ్..

ఈ క్యూట్ చిన్నారికి సౌత్ ఇండియాలోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ.. తలుపు తడుతున్న వరుస ఆఫర్లు..

Yashika Aannand: బ్రతికినంత కాలం దోషిగానే ఉండిపోతాను.. స్నేహితురాలిపై భావోద్వేగ పోస్ట్ చేసిన యాషిక..