Shilpa Shetty-Raj Kundra: ‘ఇప్పుడు విడిపోయే సమయం వచ్చింది.. ఇన్నాళ్లు నన్ను కాపాడినందుకు థాంక్స్’.. మరోసారి రాజ్ కుంద్రా ట్వీట్ వైరల్..
శుక్రవారం ట్విట్టర్ వేదికగా 'మేమిద్దరం విడిపోతున్నాం.. ఈ క్లిష్ట సమయంలో మాకు కాస్త విరామం ఇవ్వండి' అంటూ రాజ్ కుంద్రా ట్వీట్ చేయడంతో శిల్పాశెట్టి విడాకుల వార్తలు మళ్లీ తెరపైకి వచ్చాయి. అయితే కేవలం రాజ్ కుంద్రా మాత్రమే ట్వీట్ చేయడం.. శిల్పా శెట్టి సోషల్ మీడియా ఖాతాలలో మాత్రం తన భర్తకు విషెస్ తెలుపుతూ పోస్ట్ చేయడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో రాజ్ కుంద్రా ఇన్నాళ్లు తనతోపాటు ప్రయాణం చేసిన మాస్క్ గురించి ఇలా ట్వీట్ చేశాడని తెలిసిపోయింది. తాజాగా మరోసారి రాజ్ కుంద్రా చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరలవుతుంది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో తెగ వైరలవుతున్న న్యూస్ శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా విడాకుల వార్తలే. గత 24 గంటలుగా వీరిద్దరి డివోర్స్ న్యూస్ నెట్టింట సెన్సెషన్ అయ్యింది. శుక్రవారం ట్విట్టర్ వేదికగా ‘మేమిద్దరం విడిపోతున్నాం.. ఈ క్లిష్ట సమయంలో మాకు కాస్త విరామం ఇవ్వండి’ అంటూ రాజ్ కుంద్రా ట్వీట్ చేయడంతో శిల్పాశెట్టి విడాకుల వార్తలు మళ్లీ తెరపైకి వచ్చాయి. అయితే కేవలం రాజ్ కుంద్రా మాత్రమే ట్వీట్ చేయడం.. శిల్పా శెట్టి సోషల్ మీడియా ఖాతాలలో మాత్రం తన భర్తకు విషెస్ తెలుపుతూ పోస్ట్ చేయడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో రాజ్ కుంద్రా ఇన్నాళ్లు తనతోపాటు ప్రయాణం చేసిన మాస్క్ గురించి ఇలా ట్వీట్ చేశాడని తెలిసిపోయింది. తాజాగా మరోసారి రాజ్ కుంద్రా చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరలవుతుంది. గత రెండేళ్లుగా తాను ఉపయోగించిన మాస్కులకు ఇక గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చిందని.. ఇకపై తామిద్దరం వేర్వెరు అంటూ రాసుకొచ్చారు.
‘మాస్కులకు వీడ్కోలు.. ఇప్పుడు మేము విడిపోయే సమయం వచ్చింది. గత రెండు సంవత్సరాలుగా నన్ను రక్షించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు నా ప్రయాణం వేరు’ అంటూ రాసుకొచ్చారు. చాలా కాలంగా ధరించిన వివిధ రకాల మాస్క్‌ల వీడియోను కూడా షేర్ చేశాడు. దీంతో రాజ్ కుంద్రా ట్వీట్స్ కేవలం మాస్కులకు సంబంధించినవి మాత్రమే అని.. డివోర్స్ గురించి కాదని మరోసారి క్లారిటీ వచ్చేసింది. దీనిపై అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Farewell Masks …it’s time to separate now! Thank you for keeping me protected over the last two years. Onto the next phase of my journey #UT69 🙏🎭🥹 🧿😇❤️ pic.twitter.com/svhiGS8aHt
— Raj Kundra (@onlyrajkundra) October 20, 2023
నీలి చిత్రాలు తీశాడనే ఆరోపణలతో రాజ్ కుంద్రా గతంలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కొద్ది నెలలు జైలులో గడిపిన ఆయన.. బెయిల్ పై విడుదలయ్యాడు. అప్పటి నుంచి తన ముఖం మీడియాకు చూపించకుండా మాస్క్ ధరించి కనిపించాడు. దాదాపు రెండేళ్లపాటు మాస్క్ ధరించిన రాజ్ కుంద్రా.. ఇటీవల తాను నటించిన UT69 ట్రైలర్ లాంచ్ వేడుకలో మాస్క్ తొలగించాడు. ఇక ఇప్పటినుంచి మాస్క్ తీసివేస్తున్నట్లు తెలిపేందుకే ఇలా ట్వీట్స్ చేస్తున్నాడని స్పష్టమవుతోంది. గతంలో రాజ్ కుంద్రా జైలులో ఉన్న సమయంలో అతడి నుంచి శిల్పా్శెట్టి విడాకులు తీసుకోవచ్చని వార్తలు వినిపించాయి.
We have separated and kindly request you to give us time during this difficult period 🙏💔
— Raj Kundra (@onlyrajkundra) October 19, 2023
రాజ్ కుంద్రా తన జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం UT69. ఈ మూవీ ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలై అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాజ్ కుంద్రా ఆర్థర్ జైలులో గడిపిన రోజుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. జైలులో తాను పడిన కష్టాలను వినోదాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమా నవంబర్ 3న విడుదల కానుంది.