Shah Rukh Khan: ‘డుంకీ’ బడ్జెట్‌ ఎన్ని కోట్లో తెలుసా? షారుక్‌ సినిమాకు మరీ అంత తక్కువ ఖర్చు పెట్టారా?

|

Nov 23, 2023 | 5:12 PM

బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ షారుక్ ఖాన్ నటించిన 'డుంకీ' సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే 'పఠాన్', 'జవాన్' సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టడంతో షారుక్ తదుపరి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఇంతకుముందు విడుదలైన షారుక్ ఖాన్ సినిమాలకు 'డుంకీ' సినిమా చాలా భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది.

Shah Rukh Khan: డుంకీ బడ్జెట్‌ ఎన్ని కోట్లో తెలుసా? షారుక్‌ సినిమాకు మరీ అంత తక్కువ ఖర్చు పెట్టారా?
Dunki Movie
Follow us on

బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ షారుక్ ఖాన్ నటించిన ‘డుంకీ’ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టడంతో షారుక్ తదుపరి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఇంతకుముందు విడుదలైన షారుక్ ఖాన్ సినిమాలకు ‘డుంకీ’ సినిమా చాలా భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. తాజాగా డుంకీ సినిమా బడ్జెట్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది. సుమారు రూ. 250 కోట్ల బడ్జెట్‌తో షారుఖ్‌ ఖాన్‌ నటించిన ‘పఠాన్‌’ చిత్రం తెరకెక్కింది. ఇక ‘జవాన్‌’ సినిమా బడ్జెట్‌ కూడా దాదాపు 300 కోట్ల రూపాయలు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. ‘జవాన్’ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించగా, ‘పఠాన్’ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ యాక్షన్‌ కట్‌ చెప్పారు. ఇక రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుక్ నటించిన ‘డుంకీ’ డిసెంబర్ 22న విడుదల కానుంది. కాగా ఈ సినిమా బడ్జెట్ కేవలం 85 కోట్ల రూపాయలేనట. ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచింది.

ఇతర దర్శకుల్లాగా రాజ్‌కుమార్ హిరానీ సినిమాల్లో పెద్దగా యాక్షన్ సీక్వెన్స్‌ ఉండదు. మన ముందు జరిగే ఆలోచనలను దృష్టిలో పెట్టుకునే ఎంతో హృద్యంగా సినిమాలు తీస్తాడాయన. మున్నాబాయ్‌ ఎంబీబీఎస్‌, లగేరహో మున్నా భాయ్‌, త్రీ ఇడియట్స్‌, పీకే, సంజు సినిమాలు చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఇప్పుడు షారుక్‌ ఖాన్‌ ‘డుంకీ’ సినిమా కూడా చాలా సింపుల్ గా తీశారని అంటున్నారు. ఈ కారణంగానే సినిమా బడ్జెట్ 100 కోట్ల రూపాయలకు మించలేదు. రాజ్‌కుమార్ హిరానీ 75 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాల‌ని టార్గెట్ పెట్టుకున్నారట. అనుకున్న తేదీకి షూటింగ్ పూర్తి చేశారట. దాంతో సినిమా బడ్జెట్ లిమిట్ మించలేదని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

75 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్..

కాగా రాజ్‌కుమార్‌ హిరానీ, షారుక్‌ భార్య గౌరీ ఖాన్‌ కలిసి ‘డుంకీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు రోజుల్లో ఈ సినిమా బడ్జెట్ రికవరీ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్‌ నిపుణులు. ‘జవాన్‌’, ‘పఠాన్‌’ లాగా ‘డంకీ’ కూడా యాక్షన్‌ సినిమా కాదు. ఇక రాజ్‌కుమార్ హిరానీకి బాలీవుడ్ బ్లాక్‌ బస్టర్‌ డైరెక్టర్‌గా పేరుంది. అతని ఖాతాలో ఒక్క ప్లాఫ్‌ సినిమా కూడా లేదు. దీంతో ‘డుంకీ’ కూడా ఘన విజయం సాధిస్తుందని షారుక్‌ అభిమానులు చెబుతున్నారు. ఇందులో షారుక్‌తో పాటు తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, బొమన్ ఇరానీ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. లండన్ వెళ్లాలని కలలు కనే ఐదుగురు వ్యక్తుల కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. రొమాన్స్, కామెడీ సినిమాలో హైలెట్ కానున్నాయి. డిసెంబర్ 22న ఈ సినిమా విడుదలవుతోంది.

బ్లాక్‌ బస్టర్‌ ట్రాక్‌ రికార్డ్‌..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..