Tollywood: కూతురిని హీరోయిన్‏గా పరిచయం చేసేందుకు డాన్‏గా మారిన హీరో.. ఎవరంటే..

అతడికి బదులుగా స్టార్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌కి డాన్‌ పాత్ర నటించనున్నారని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి మరో ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ మూవీలో షారుఖ్ మళ్లీ డాన్ పాత్రలో నటించనున్నాడట. అది కూడా తన కూతురు సుహానా ఖాన్ కోసమే.

Tollywood: కూతురిని హీరోయిన్‏గా పరిచయం చేసేందుకు డాన్‏గా మారిన హీరో.. ఎవరంటే..
Actors
Follow us

|

Updated on: Apr 24, 2024 | 8:12 AM

బాలీవుడ్ ఇండస్ట్రీలో అమితాబ్ బచ్చన్ తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో అంటే షారుఖ్ ఖాన్. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే పరిశ్రమలోకి అడుగుపెట్టి బాలీవుడ్ బాద్ షాగా ఎదిగాడు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అమితాబ్ తర్వాత సినిమాల్లో డాన్ పాత్రలో నటించిన మెప్పించిన హీరో కూడా షారుఖ్ కావడం విశేషం. అయితే కొన్ని నెలల క్రితం డాన్ 3 సినిమాను మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ మూవీ షారుఖ్ ఖాన్ నటించడం లేదు. అతడికి బదులుగా స్టార్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌కి డాన్‌ పాత్ర నటించనున్నారని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి మరో ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ మూవీలో షారుఖ్ మళ్లీ డాన్ పాత్రలో నటించనున్నాడట. అది కూడా తన కూతురు సుహానా ఖాన్ కోసమే.

షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ‘కింగ్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాను షారుఖ్ సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అలాగే కూతురి కోసం ఈమూవీలో డాన్ పాత్రలో షారుఖ్ నటించేందుకు రెడీ అయ్యారట. ఇందులో డాన్ పాత్రకు నెగిటివ్ షేడ్స్ ఉంటాయని అంటున్నారు. ఈ సినిమాలో ఆయన లుక్ కూడా డిజైన్ చేశారు.  దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను రూపొందించనున్నారని సమాచారం. సిద్ధార్థ్ ఆనంద్, సుజోయ్ ఘోష్ కలిసి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా యాక్షన్‌కి సంబంధించి ప్లాన్‌ జరుగుతోంది. విదేశాల నుంచి స్టంట్ టీమ్ వస్తుందని తెలుస్తోంది. సుహానా యాక్షన్ సన్నివేశాల కోసం శిక్షణ తీసుకుంటుంది.

సుహానా ఖాన్ ఇప్పటికే ‘ది ఆర్చీస్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ ఆ సినిమా థియేటర్లలో విడుదల కాలేదు. నెట్‌ఫ్లిక్స్ ద్వారా మాత్రమే అడియన్స్ ముందుకు వచ్చింది. ఇప్పుడు కింగ్ సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయం కానుంది. అందుకే ఈ సినిమాపై షారుఖ్‌ ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..