AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలో ‘స్పైడర్ మ్యాన్’ కొత్త సినిమా.. తెలుగులోనూ రూ.20 వేల కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

జులైలో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజైన 'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే'కు రికార్డు కలెక్షన్లు వచ్చాయి. ఇండియాలోనూ చాలా మంది సినీ అభిమానులు ఫస్ట్ డే ఫస్ట్ షోనే ఈ సినిమాను ఎంజాయ్ చేశారు. ఇప్పుడీ బాక్సాఫీస్ సెన్సేషన్ ఓటీటీలోకి రానుంది.

OTT Movie: ఓటీటీలో 'స్పైడర్ మ్యాన్' కొత్త సినిమా.. తెలుగులోనూ రూ.20 వేల కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Spiderman Brand New Day Movie
Basha Shek
|

Updated on: Oct 04, 2026 | 12:30 PM

Share

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సినిమాలకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అందులోనూ ‘స్పైడర్-మ్యాన్’ సిరీస్ సినిమాలంటే ఆ క్రేజ్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుంది. ఇండియాలోనూ స్పైడర్-మ్యాన్ సినిమాలకు రికార్డు కలెక్షన్లు వస్తుంటాయి. అలా ఈ సిరీస్ లోనే విడుదలైన లేటెస్ట్ విజువల్ వండర్ ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’. జులై 30న వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సూపర్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ ఈ సినిమా అలరించింది. అందుకు తగ్గట్టుగానే ఈ స్పైడర్ మ్యాన్ మూవీకి బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు వచ్చాయి. గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 2.49 బిలియన్ డాలర్లు (సుమారు రూ.20,000 కోట్లకు పైగా) గ్రాస్ వసూలు చేసిన ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూడో సినిమాగా రికార్డుల కెక్కింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి రానుంది. థియేటర్లలో ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను మిస్ అయిన వారికి, మళ్లీ మళ్లీ చూడాలనుకునే ఫ్యాన్స్ కోసం డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.

కాగా ఇప్పటికే ఇండియా బయట ఇతర దేశాల్లో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఓటీటీలో రిలీజైన సంగతి తెలిసిందే. ఇండియాలో మాత్రం అక్టోబర్ 6 నుంచి ఈ మూవీ అందుబాటులోకి రానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. అయితే మొదట కేవలం రెంటల్ బేసిస్ లేదా బై ఆప్షన్స్ విధానంలో మాత్రమే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. అంటే, సాధారణ అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారైనా సరే, ఈ సినిమాను వీక్షించడానికి అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఫ్రీగా అందుబాటులోకి రానుంది.

స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీకి డెస్టిన్ డేవిట్ క్రెట్టన్ దర్శకత్వం వహించారు. టామ్ హాలెండ్, జెండయా, శాడీ సింక్, మార్క్ రఫాలో, జాకబ్, జాన్ బెర్న్‌థాల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. మార్వెల్ స్టూడియోస్ సంస్థ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ మూవీని నిర్మించింది. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఓటీటీలో 'స్పైడర్ మ్యాన్' కొత్త సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో 'స్పైడర్ మ్యాన్' కొత్త సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఒక్క మ్యాచ్‌లో హిట్.. వరుసగా అట్టర్ ఫ్లాప్.. ఇంక ఇంటికేనా?
ఒక్క మ్యాచ్‌లో హిట్.. వరుసగా అట్టర్ ఫ్లాప్.. ఇంక ఇంటికేనా?
షుగర్ కంట్రోల్‌కు, బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన కొర్రల అన్నం
షుగర్ కంట్రోల్‌కు, బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన కొర్రల అన్నం
మహాలయ అమావాస్య.. ఈ వస్తువు ఇంటికి తెస్తే ఆర్థిక సమస్యలు వస్తాయట..
మహాలయ అమావాస్య.. ఈ వస్తువు ఇంటికి తెస్తే ఆర్థిక సమస్యలు వస్తాయట..
ఫిజికల్ ఎనర్జీ కోసం బెల్లం పాకంతో క్రంచీగా.. ఓట్స్ లడ్డు
ఫిజికల్ ఎనర్జీ కోసం బెల్లం పాకంతో క్రంచీగా.. ఓట్స్ లడ్డు
సింగీతంగారు తీసిన మొదటి సినిమా.. ఆసక్తికర విషయాలు..
సింగీతంగారు తీసిన మొదటి సినిమా.. ఆసక్తికర విషయాలు..
ఇంటి ముందు స్ట్రీట్ లైట్ పాడైతే ఎవరు బాగు చేయాలి? ఎవరో తెలుసా?
ఇంటి ముందు స్ట్రీట్ లైట్ పాడైతే ఎవరు బాగు చేయాలి? ఎవరో తెలుసా?
కొబ్బరికాయ ముక్కలు చేయకుండా.. ఏడుగురికి ఎలా పంచాలి? చిక్కుప్రశ్న
కొబ్బరికాయ ముక్కలు చేయకుండా.. ఏడుగురికి ఎలా పంచాలి? చిక్కుప్రశ్న
SRHకు అభిషేక్ శర్మ గుడ్‌బై..? ఐపీఎల్ 2027లో కొత్త జట్టుతో బరిలోకి
SRHకు అభిషేక్ శర్మ గుడ్‌బై..? ఐపీఎల్ 2027లో కొత్త జట్టుతో బరిలోకి
కర్రీ వెన్నలా సాఫ్ట్‌గా ఉడకాలంటే.. ఇలాంటి మటన్ తీసుకోండి..
కర్రీ వెన్నలా సాఫ్ట్‌గా ఉడకాలంటే.. ఇలాంటి మటన్ తీసుకోండి..