బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటిస్తోన్న ‘జవాన్’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్యూర్ యాక్షన్ బేస్డ్‌గా జవాన్ తెరకెక్కిందని ఇప్పటివరకు రిలీజైన టీజర్ల్స్, గ్లింప్స్, ప్రివ్యూ వీడియోలను చూస్తే అర్థమైంది. పఠాన్ లాగే ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. కాగా రిలీజ్‌కు ముహూర్తం దగ్గరపడుతుండడంతో జవాన్ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. విశేషమేమిటంటే ఈ సినిమాలోని ఏ సన్నివేశానికి కూడా కత్తెర పడలేదు. దీంతో షారూఖ్ ఖాన్ అభిమానులు తెగ ఖుషి అవుతున్నారు. అయితే చిత్రంలో కొన్ని మార్పులు చేయాలని సెన్సార్ బోర్డు పేర్కొంది. కొన్ని వివాదాస్పదమైన డైలాగులతో పాటు హింసాత్మకంగా ఉన్న సీన్ల విజువల్స్‌ను తొలగించాలని సూచించింది. అలాగే సినిమాలోని ఆత్మహత్య సన్నివేశాలను కూడా మార్పు చేయాలని తెలిపింది. ఇదిలా ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ‘జవాన్’ చిత్రానికి యు/ఎ సర్టిఫికేట్ వచ్చింది. అంటే అందరూ సినిమా చూడొచ్చు. అయితే 18 ఏళ్లలోపు వారు తమ తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో షారుఖ్ సినిమాను చూడవచ్చు. జవాన్ సినిమా నిడివి 169.14 నిమిషాలు. అంటే సినిమా రన్ టైం రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలు ఉంటుందన్నమాట. షారుఖ్ ఖాన్ గత సినిమా ‘పఠాన్’ సూపర్ హిట్ అయింది. ఈ సినిమా వేల కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. ఇప్పుడు జవాన్ సినిమా కూడా ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొడుతుంది అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం తెరకెక్కించిన జవాన్ సినిమాలో షారుఖ్ సరసన నయనతార హీరోయిన్‌గా నటించింది. విజయ్ సేతుపతి కీ రోల్‌లో కనిపించనున్నారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె గెస్ట్ రోల్‌లో కనిపించనుంది. క ప్రియమణి సైతం ఆఫీసర్ పాత్రలో మెరవనుంది. అలాగే సౌతిండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ జవాన్ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నాడు. మరి ఇన్ని హంగులతో వస్తోన్న జవాన్ ఎన్ని రికార్డులు సృష్టిస్తాడో లెట్స్ వెయిట్ అండ్ సీ.
Woww, the film Jawan is unstoppable 🔥🔥#Jawan Became the 1st Bollywood movie to Collect “200K $” during Advance booking , From Overseas Market Before 15 Days of it’s worldwide Release.
Just can’t wait for pre-booking in India ,
#ShahRukhKhan
…pic.twitter.com/3aecWOcImA— Sahil Sultan (@AreToKyaHua) August 23, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.