Shah Rukh Khan: ‘డంకీ’ టైటిల్‌ మీనింగ్‌ ఏంటో చెప్పేసిన హీరో షారుఖ్‌.. ఇంత చిన్న పదంలో అంత అర్థముందా?

బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుఖ్ ఖాన్ ఈ ఏడాది ఇప్పటికే రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన 'పఠాన్' సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి 1000 కోట్లకు పైగా రాబట్టింది. ఆ తర్వాత విడుదలైన 'జవాన్' సినిమా కూడా బ్లాక్ బస్టర్. ఇప్పుడు షారుఖ్ నటించిన మరో చిత్రం 'డంకీ' ఈ ఏడాది విడుదలకు సిద్ధంగా ఉంది

Shah Rukh Khan: డంకీ టైటిల్‌ మీనింగ్‌ ఏంటో చెప్పేసిన హీరో షారుఖ్‌.. ఇంత చిన్న పదంలో అంత అర్థముందా?
Dunki Movie

Updated on: Nov 25, 2023 | 9:03 AM

బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుఖ్ ఖాన్ ఈ ఏడాది ఇప్పటికే రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ‘పఠాన్’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి 1000 కోట్లకు పైగా రాబట్టింది. ఆ తర్వాత విడుదలైన ‘జవాన్’ సినిమా కూడా బ్లాక్ బస్టర్. ఇప్పుడు షారుఖ్ నటించిన మరో చిత్రం ‘డంకీ’ ఈ ఏడాది విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని అంచనా వేస్తున్నారు. షారుఖ్ ఖాన్ సమయం దొరికినప్పుడల్లా #AskSRK అనే హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగించి ట్విట్టర్‌లో తన అభిమానులతో ముచ్చటిస్తాడు. అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానమిచ్చారు. తాజాగా మరోసారి ట్విట్టర్‌ వేదికగా నెటిజన్లతో ముచ్చటించారు బాలీవుడ్ బాద్‌షా. ఈ నేపథ్యంలో చాలా మంది అతని తదుపరి చిత్రం ‘డంకీ’ గురించి ప్రశ్నలు అడిగారు. ‘డంకీ’ అంటే ఏమిటని ఓ అభిమాని అడిగాడు. దీనికి షారుక్‌.. ఏదైనా సరిహద్దులో అక్రమంగా ప్రవేశించేవాడిని డంకీ అని పిలుస్తారు. దీనిని డంకీ అని ఉచ్ఛరిస్తారు. కానీ కొంతమంది ఫంకీ, హంకీ లేదా మంకీ అని కూడా ఉచ్ఛరిస్తారు అని సరదాగా సమాధానమిచ్చారు షారుక్‌.

డిసెంబర్ 22న ‘డంకీ’ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో షారూఖ్‌తో పాటు తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ తదితరులు నటించారు. నలుగురు స్నేహితుల బృందం అక్రమంగా విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌, పాటలు విడుదలై అందరినీ ఆకట్టుకున్నాయి. షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’, ‘జవాన్’ చిత్రాల విజయాల తర్వాత ‘డంకీ’పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. రాజ్‌కుమార్ హిరానీ, అభిజిత్ జోషి, కనికా ధిల్లాన్ ఈ చిత్రానికి కథను అందించారు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు. రాజ్‌కుమార్ హిరానీ ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’, ‘లగే రహో మున్నాభాయ్’, ‘3 ఇడియట్స్’, ‘పీకే’, ‘సంజు’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

ఇవి కూడా చదవండి

డంకీ సినిమాలో హార్డీగా షారూఖ్, మనుగా తాప్సీ, రాజ్‌కుమార్ హిరానీ అభిమాన నటుడు బొమన్ ఇరానీ ఇక్కడ గులాటీ పాత్రలో నటించారు. అక్రమంగా కెనడా, అమెరికా వెళ్లే వారి కథను రాజ్‌కుమార్ హిరానీ డంకీ సినిమాలో ముడిపెట్టారు. జియో స్టూడియోస్‌, రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, రాజ్‌కుమార్‌ హిరానీ ఫిలింస్‌ బ్యానర్‌పై గౌరీ ఖాన్‌, రాజ్‌కుమార్‌ హిరానీ డంకీ సినిమాను నిర్మిస్తున్నారు. క్రిస్మస్‌ కానుకగా సినిమా విడుదల కానుంది.

డంకీ టైటిల్ అర్థమిదే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.