Dilip kumar Hospitalised: బాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ (98) అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు. గత కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత వ్యాధులతో ఇబ్బందిపడుతోన్న దిలీప్ కుమార్‌ను ఆదివారం ఉదయం కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ముంబయిలోని హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దిలీప్ కుమార్ ప్రస్తుతం సీనియర్ డాక్టర్లు.. కార్డియాలజిస్ట్ నితిన్ గొఖలే, పుల్మనాలజిస్ట్ డాక్టర్ జలిల్ పార్‌కర్ పర్యవేక్షణలో ఉన్నారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి దిలీప్ కుమార్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇక దిలీప్ కుమార్ ఇద్దరు తమ్ముళ్లు అస్లాం ఖాన్, ఎహ్సాన్ ఖాన్ కరోనా కారణంగా గతేడాది మరణించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. గత నెలలోనూ ఆయన సాధారణ పరీక్షల కోసం దవాఖానలో చేరారు. పలు పరీక్షల అనంతరం వైద్యులు ఆయనను డిశ్చార్జి చేశారు. ఇక దిలీప్ కుమార్ కెరీర్ విషయానికొస్తే.. 1944లో ఆయన మొదటిసారి వెండితెరకు పరిచయమయ్యారు. వైవిధ్య చిత్రాల్లో నటించిన దిలీప్ కుమార్ దేశ వ్యాప్తంగా నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు.
Also Read: Richa: తన బుజ్జి బాబును ప్రపంచానికి పరిచయం చేసిన రిచా.. అచ్చం తన భర్తలాగే ఉన్నడంటూ..
Fahad Fazil: ‘పుష్ప’ కోసం కష్టపడుతున్న మలయాళ స్టార్.. నేర్చుకుంటున్న ఫహాద్ ఫాజిల్..
Actress Anjali : ఇండస్ట్రీలో ఒకరి ఆఫర్ ను మరొకరు లాక్కునే అవకాశం ఉండదంటున్న అంజలి..