
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సారా అలీ ఖాన్ (Sara Ali Khan) ఒకరు. అతి తక్కువ సమయంలో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గత కొద్దిరోజులుగా సారాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గోన్న సారా.. డేటింగ్ క్రష్ విజయ్ దేవరకొండ అని చెప్పడంతో నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది. ఇక గత కొద్ది రోజులుగా సారా అలీ ఖాన్, క్రికెటర్ శుభ్ మాన్ గిల్ డేటింగ్లో ఉన్నారంటూ వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా వీరిద్దరు కలిసి రెస్టారెంట్‍లో డిన్నర్ చేస్తున్న ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అందులో సారా పింక్ కలర్ డ్రెస్లో ఉండగా.. శుభ్ మాన్ క్యాజువల్ లుక్ వైట్ డ్రెస్లో ఉన్నాడు. గతంలో సారా అలీ ఖాన్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ తో డేటింగ్ లో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారని టాక్ వినిపించింది.
అలాగే క్రికెటర్ శుభ్ మాన్ గిల్..దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ తో డేటింగ్ అంటూ గతంలో వార్తలు వినిపించాయి. శుభ్ మాన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ను 2017 ఫిబ్రవరిలో ప్రారంభించాడు. ఇక సారా అలీ ఖాన్.. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమార్తె. 2017లో దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సరసన కేదార్ నాథ్ చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది సారా.
Shubman gill date sara ali khan ko kar eha tha aur hum kisi aur hi sara ko lapet rhe the?#Shubmangill #CricketTwitter pic.twitter.com/oEAAXqXgOz
— Arun (@ArunTuThikHoGya) August 29, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.