Sara Ali Khan: కాబోయే భర్త ఇల్లరికం రావాల్సిందే.. సారా అలీ ఖాన్‌ ఆసక్తికర కామెంట్స్..

| Edited By: Ravi Kiran

Jan 04, 2022 | 7:37 AM

బాలీవుడ్‌ బ్యూటీ, సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్‌ నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది...

Sara Ali Khan: కాబోయే భర్త ఇల్లరికం రావాల్సిందే.. సారా అలీ ఖాన్‌ ఆసక్తికర కామెంట్స్..
Sara Ali Khan
Follow us on

బాలీవుడ్‌ బ్యూటీ, సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్‌ నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ‘కేదార్‌నాథ్‌’తో నటిగా తెరంగేట్రం చేసిన ఆమె ‘లవ్‌ ఆజ్‌కల్‌’, ‘కూలీ నం:1’, ‘అత్రాంగి రే’ చిత్రాల్లో నటించారు. ఇటీవల విడుదలైన ‘అత్రాంగి రే’లో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో సారా వివాహితగా కనిపించారు. ఇటీవలే ఈ సినిమా సక్సెస్‌ మీట్‌లో పాల్గొన్న సారా.. తనకు కాబోయే భర్తపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమ్మను వదిలి ఉండటం నా వల్ల కాదు. నన్ను పెళ్లి చేసుకునే వ్యక్తి ఇల్లరికం వచ్చేందుకు ఒప్పుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

బాలీవుడ్​ స్టార్​ నటుడు సైఫ్​ అలీఖాన్​ మొదటి భార్య అమృతా సింగ్. వీరికి సారా, ఇబ్రహీం అలీఖాన్​ సంతానం. అనంతరం అమృతా సింగ్​తో విడిపోయిన సైఫ్​.. స్టార్​ హీరోయిన్​ కరీనా కపూర్​ను రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు మగపిల్లలు. ఇక, ‘అత్రాంగి రే’ చూసి తన తల్లిదండ్రులు సైఫ్‌, అమృతా కన్నీళ్లు పెట్టుకున్నారని సారా తెలిపారు. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, ధనుష్ ప్రధాన పాత్రల్లో నటించారు.

Read Also.. Pushpa: నెట్టింట్లో బన్నీ మేనియా..  అమెజాన్ ప్రైమ్‏లో పుష్ప.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనంటూ..