Salman Khan: బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ ముంబై పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చారు. సల్మాన్‌తో పాటు ఆయన తండ్రి సలీంను చంపేస్తామంటూ వచ్చిన లేఖ తీవ్ర కలకలం సృష్టించింది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ముంబై పోలీసులు.. సల్మాన్ నుంచి స్టేట్‌మెంట్ కోరారు. గ్యాంగ్‌స్టర్స్ గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్ ఎవరో తెలియదని పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో సల్మాన్ పేర్కొన్నారు. తనకు ఎవరు శత్రువులు లేరని.. ఎవరిపై అనుమానం లేదని స్టేట్‌మెంట్ ఇచ్చారు.
కాగా, సల్మాన్‌ఖాన్, ఆయన తండ్రి సలీంఖాన్‌ను చంపేస్తామని ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు లేఖ విడుదల చేశారు. పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా లాగే సల్మాన్‌ను చంపేస్తామని ఈ లేఖలో బెదిరించారు. ఈ లేఖపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది సల్మాన్‌ఖాన్ కుటుంబం. దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు లేఖ ఎవరు రాశారన్న విషయంపై ఆరా తీస్తున్నారు.
సిద్ధూ మూసేవాలా మర్డర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న లారెన్స్ బిష్ణోయ్ గతంలో సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తానని బెదిరించాడు. తమ కులదైవం కృష్ణజింకను వేటాడి చంపినందుకు సల్మాన్‌పై ప్రతీకారం తప్పదని హెచ్చరించాడు లారెన్స్ బిష్ణోయ్. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సల్మాన్‌కు అదనపు భద్రత కల్పించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి