‘నో స్మోకింగ్ జోన్‏’లో సిగరేట్ కాల్చిన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

సాధరణంగా సెలబ్రెటీలు ఏం చేసినా ట్రెండ్ అవుతునే ఉంటుంది. అలాగే కొన్ని సార్లు వారు చేసిన పనుల వలన నెటిజన్ల ఆగ్రహానికి గురవుతుంటారు.

నో స్మోకింగ్ జోన్‏లో సిగరేట్ కాల్చిన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

Updated on: Feb 19, 2021 | 6:41 PM

సాధరణంగా సెలబ్రెటీలు ఏం చేసినా ట్రెండ్ అవుతునే ఉంటుంది. అలాగే కొన్ని సార్లు వారు చేసిన పనుల వలన నెటిజన్ల ఆగ్రహానికి గురవుతుంటారు. ఇక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‏కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయిదు పదుల వయసులో కూడా బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‏గా పేరొందాడు సల్మాన్. ఇక ఈ హీరోకు లేడీ ఫాలోయింగ్ ఏ రేంజ్‏లో ఉంటుందో చెప్పక్కర్లేదు. కొన్ని సంవత్సరాలుగా జింక వేట కేసులో ఇబ్బందులు పడుతూ వచ్చిన బీటౌన్ బాద్షా ఇటీవలే ఈ సమస్యను నుంచి విముక్తి పొందాడు. తాజాగా నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు.

అదేంటంటే.. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం నటిస్తున్న ‘రాధే’ సినిమాకు డబ్బింగ్ చేప్పెందుకు ముంబైలోని డబ్బింగ్ స్డూడియోకు వెళ్ళాడు. అక్కడ No smoking zone అని బోర్డు ఉన్న స్థలంలో నిల్చున్న సల్మాన్ సిగరేట్ కాలుస్తున్న ఫోటోల సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అవి చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. సల్మాన్ బాయ్ నో స్మోకింగ్ జోన్లో సిగరేట్ కాల్చడం సరైనది కాదంటుండగా.. ఇతడిని క్లాసిక్ సల్మాన్ అంటున్నారా ? అంటూ మరో నెటిజన్ కామెంట్ చేస్తున్నాడు.

Also Read:

Drishyam 2 Review: ‘దృశ్యం’ను మించిన ట్విస్టులు.. ఆద్యంతం ఉత్కంఠను కలిగిస్తున్న మోహన్ లాల్ ‘దృశ్యం 2’..