ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తనకు తెలుసంటున్నారు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్. తన కెరీర్‌లో క్రేజీయస్ట్ మూవీగా ప్రమోటైన రాధే రిలీజ్ విషయంలో టూ ఇంటిలిజెంట్‌గా వ్యవహరించారు. ఈవిధంగా సినిమా సమాజానికి సల్మాన్‌ఖాన్ ఏరకమైన మెసేజ్ ఇస్తున్నట్టు..?
సల్మాన్‌ఖాన్ మూవీ రాధే సినీ ఇండస్ట్రీలో ట్రెండ్‌సెట్టర్ కాబోతోంది. మే13న థియేటర్లతో పాటు.. అదేరోజు డిజిటల్ రిలీజ్‌క్కూడా ఓకే చెప్పారు సల్లూభాయ్. నిన్న ప్రొడ్యూసర్ హోదాలో రిలీజ్ న్యూస్ బైటపెట్టి.. ఈరోజు గ్రాండ్‌గా ట్రయిలర్ కూడా బైటికొదిలేశాడు మిస్టర్ రాధే. ప్రజంట్ సిట్యువేషన్‌లో సల్మాన్ తీసుకున్న డెసిషన్‌ని బోల్డ్ అండ్ బ్యూటిఫుల్‌గా డిఫైన్ చేస్తున్నారు సినీ పండిట్స్. కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగి.. దాదాపు లాక్‌డౌన్ నీడలో మగ్గుతోంది ప్రజానీకం. ఈ టైమ్‌లో థియేటర్లను మాత్రమే నమ్ముకుంటే లాభం లేదనుకుని… డిజిటల్ డయాస్‌తో కూడా డీల్ ఓకే చేసుకున్నారు సల్లూ. కొన్ని సేఫెస్ట్ ప్లేసెస్‌లో బిగ్ స్క్రీన్స్‌పై రిలీజ్ చేస్తూ.. కల్ట్ ఆడియన్స్‌కి ఛాన్స్ ఇవ్వబోతున్నారు. ఇల్లుదాటి బైటికి రాలేని యావరేజ్ ఆడియన్స్ కూడా ఓటీటీలో ‘మేజిక్ ఆఫ్ రాధే’ని ఎంజాయ్ చెయ్యొచ్చట. దిశాపటానీ హీరోయిన్‌గా నటిస్తున్న రాధే మూవీలో డ్రగ్ మాఫియాను కంట్రోల్ చేసి ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నారు సల్మాన్. డైరెక్టర్‌గా సల్మాన్‌తో ప్రభుదేవాకు ఇది హ్యాట్రిక్ మూవీ. గతంలో వీళ్ల కాంబోలో పోకిరీ రీమేక్ వాంటెడ్, దబ్బంగ్3 వచ్చాయి. డీఎస్‌పీ మార్క్ వున్న క్రేజీ బీట్…. సీటీమార్…. రాధే మూవీలో జబర్దస్త్‌గా రిపీటైంది. ఇప్పుడు ఔట్‌పుట్ రెడీగా వున్న కొన్ని బిగ్‌సైజ్ మూవీస్ రిలీజ్ డేట్స్ మార్చుకునే ఆలోచనలో వున్నాయి. రిలీజ్ ఆలస్యం అయ్యేకొద్దీ పెట్టుబడిపై వడ్డీ భారం పెరుగుతుంది. పైగా… పరిస్థితి ఎప్పుడు కంట్రోల్లోకొస్తుందన్న క్లారిటీ కూడా లేదు. అందుకే… కొద్దిగా కాంప్రమైజ్ అయితే.. తనలా డ్యూయల్ థాట్‌ని ఫాలో కావొచ్చని హింట్ ఇచ్చారు సల్మాన్. మరి.. మేనెలలో రిలీజ్ ప్లాన్ చేసుకున్న మన తెలుగు సినిమాల్లో ఏవైనా రాధే కాన్సెప్ట్‌ని ఫాలో అవుతాయా అనేది చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :