Tiger 3: దైర్యం చేస్తున్న సల్మాన్ ఖాన్.. సినిమా రిలీజ్ విషయంలో సాహసమనే చెప్పాలి

|

Nov 07, 2023 | 4:11 PM

టైగర్ 3 ' సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులు ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి . ఈ సినిమా తొలిరోజు భారీ వసూళ్లను రాబట్టడంతో పాటు రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కాగా ముంబై, ఢిల్లీలో మంచి స్పందన వస్తోంది. 'టైగర్ 3' ట్రైలర్‌ పై ఇప్పటికే అంచనాలు ఏర్పడ్డాయి.

Tiger 3: దైర్యం చేస్తున్న సల్మాన్ ఖాన్.. సినిమా రిలీజ్ విషయంలో సాహసమనే చెప్పాలి
Tiger 3
Follow us on

సల్మాన్ ఖాన్ నటించిన ‘ టైగర్ 3 ‘ సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులు ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి . ఈ సినిమా తొలిరోజు భారీ వసూళ్లను రాబట్టడంతో పాటు రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కాగా ముంబై, ఢిల్లీలో మంచి స్పందన వస్తోంది. ‘టైగర్ 3’ ట్రైలర్‌ పై ఇప్పటికే అంచనాలు ఏర్పడ్డాయి. బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ సినిమా తొలిరోజు వసూళ్లు రూ.40 కోట్లు దాటే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

‘టైగర్ 3’ సినిమాకు ‘యుఎ’ సర్టిఫికేట్ వచ్చింది. సినిమా నిడివి 2 గంటల 35 నిమిషాలు ఉంది. ఈ చిత్రాన్ని 2డి, ఐసిఇ, ఐమాక్స్ 2డి, 4డిఎక్స్ వెర్షన్లలో విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల కానుంది. టైగర్ 3 తొలిరోజు భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది ఇప్పటికే ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. .

ఇప్పటికే అన్ని ఏరియాల్లో సినిమా కు థియేటర్స్ ను కేటాయించారు.  ‘టైగర్ 3’ సినిమా విడుదలకు మరికొద్ది రోజులు మిగిలి ఉండగా, షోల సంఖ్య పెరగనుందని తెలుస్తోంది. ముంబయిలో ఈ సినిమా ఇప్పటికే 900 షోలు దాటింది. రానున్న రోజుల్లో షోల సంఖ్య పెరగనుంది. బుకింగ్స్ కూడా నెమ్మదిగా పుంజుకుంటున్నాయి.

సాధారణంగా గురు, శుక్రవారాల్లో సినిమాలు విడుదలవుతాయి. అయితే ‘టైగర్ 3’ ఆదివారం (నవంబర్ 12)న విడుదలవుతోంది. దీని ద్వారా చిత్ర బృందం సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. మరి ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. ఆదివారం భారత్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ ఉంది. ఇది సినిమా వసూళ్లపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. మల్టీప్లెక్స్‌లో ఇప్పటివరకు 44,500 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. PVR ఐనాక్స్‌లో 37,000, సినీపోలిస్‌లో 7,500 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. తొలిరోజు 40 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతుందని అంటున్నారు.

సల్మాన్ ఖాన్ ట్విట్టర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.