AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఆ హీరో ఆత్మహత్య చేసుకోలేదు.. అతడిని చంపేశారు.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..

సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. ఈ పేరు వినిపిస్తే సినీ ప్రియుల కళ్లు చెమ్మగిల్లుతాయి. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేని ఓ కుర్రాడు బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలను అందుకున్నాడు. వరుస హిట్ చిత్రాలతో స్టార్ డమ్ అందుకున్నాడు. కానీ కెరీర్ లో స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలోనే ఊహించని రీతిలో తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Tollywood: ఆ హీరో ఆత్మహత్య చేసుకోలేదు.. అతడిని చంపేశారు.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..
Sushanth Singh Rajputh, Som
Rajitha Chanti
|

Updated on: Nov 06, 2024 | 5:54 PM

Share

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ వీడని మిస్టరీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేని ఓ సాధారణ కుర్రాడు సినీరంగంలో అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో ఫుల్ ఫాంలో దూసుకుపోతున్నాడు. కానీ అనుహ్యంగా ఒకరోజు తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పట్లో సుశాంత్ మరణం ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించింది. అతడు సూసైడ్ చేసుకోలేదని.. అతడిని కొందరు సినీ ప్రముఖులే చంపేశారంటూ సుశాంత్ కుటుంబ సభ్యులు, అభిమానులు ఆరోపించారు. మరోవైపు సుశాంత్ శరీరంపై గాయాలు ఉండడంతో ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరింది. కానీ అప్పటికే సుశాంత్ మరణం ఆత్మహత్య అని.. హత్య కాదంటూ పోలీసులు నిర్దారించారు. మరోవైపు సుశాంత్ సింగ్ మృతి పై సీబీఐ విచారణ చేపట్టింది. ఇప్పటికీ సుశాంత్ మృతిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్.. సల్మాన్ కాన్ మాజీ ప్రేయసి సోమీ అలీ సుశాంత్ సూసైడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సోమీ అలీ.. ఇటీవలే రెడ్డీట్ లో #AskMeAnything సెషన్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతిపై చేసిన కామెంట్స్ నెట్టింట తీవ్ర దుమారం సృష్టిస్తున్నాయి. బాలీవుడ్ గురించి అంతగా తెలియని నిజాలను చెప్పాలని ఓ వినియోగదారుడు సోమీ అలీని ప్రశ్నించారు. సోమీ అలీ మాట్లాడుతూ.. ‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోలేదు. నిజానికి అతడిని చంపేశారు. అతడి పోస్ట్ మార్టం నివేదికలలో కూడా అదే ఉంది. కానీ డాక్టర్స్ అతడి పోస్ట్ మార్టం నివేదికలను మార్చేశారు. రిపోర్ట్సులో డాక్టర్స్ ఏముందని అన్నారు. ఒకసారి అడగండి ? ‘ అని తెలిపింది.

అలాగే సోమీ అలీ మాట్లాడుతూ.. ‘సుశాంత్ సింగ్ రాజ్ పుత్, జియా ఖాన్ వంటి ఇతర నటీనటులకు న్యాయం కావాలి. రవీంద్ర పాటిల్ ఎలా ఉన్నారు ? అతడికి ఏం జరిగింది. ‘ అంటూ ప్రశ్నించింది. ప్రస్తుతం సోమీ అలీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14, 2020న తన నివాసంలో ఉరి వేసుకుని కనిపించాడు. ఈ కేసును తొలుత ముంబై పోలీసులు విచారించారు. 2020 ఆగస్టులో సుప్రీం కోర్టు ఆదేశాల తర్వాత అది సీబీఐకి బదిలీ చేశారు.

ఇది చదవండి : Tollywood : అదృష్టం కలిసిరాని అందాల రాశి.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా.. ?

Dandupalyam Movie: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. దండుపాళ్యం హీరోయిన్‏ను చూస్తే షాకవ్వాల్సిందే..

Tollywood: నిర్మాతలు డబ్బులు ఇవ్వలేదు.. ఎన్నో ఇబ్బందులు పడిన హీరోయిన్.. చివరకు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.