AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Movie News: రావ‌ణాసుడి పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ ఇద్ద‌రు బాలీవుడ్ బ‌డా హీరోలు..

కేజీఎఫ్ సెకండ్ చాప్టర్లో కరడుగట్టిన విలన్ గా అధీరా పాత్రకు న్యాయం చెయ్యబోతున్నారు సంజయ్ దత్. నాయక్ నహీ ఖల్ నాయక్ హూ మై అంటూ..

Movie News: రావ‌ణాసుడి పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ ఇద్ద‌రు బాలీవుడ్ బ‌డా హీరోలు..
Saif Ranveer
Ram Naramaneni
|

Updated on: May 26, 2021 | 10:38 PM

Share

కేజీఎఫ్ సెకండ్ చాప్టర్లో కరడుగట్టిన విలన్ గా అధీరా పాత్రకు న్యాయం చెయ్యబోతున్నారు సంజయ్ దత్. నాయక్ నహీ ఖల్ నాయక్ హూ మై అంటూ… గతంలోనే గర్జించిన సంజూకు ఇది కొత్తేమీ కాదు. లేటెస్ట్ గా మరికొంతమంది బీటౌన్ సూపర్ స్టార్స్ నెగిటివ్ పాత్రలు ట్రై చేస్తూనే వున్నారు. కానీ.. ఇద్దరు హేమాహేమీల మధ్య ఈ విషయంలో ఒక బిగ్ ఛాలెంజ్ మొదలైంది. నెగిటివ్ షేడ్స్ లోనే పాజిటివ్ వైబ్స్ కనిపించే రావణాసురుడి పాత్ర.. ఎంతటి బిగ్ యాక్టర్ కయినా ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్. బ్లాక్ అండ్ అండ్ వైట్ ఏరాలో సీనియర్ ఎన్టీయార్ కూడా లంకేశుడిగా ట్రై చేసి సక్సెస్ కొట్టారు. ఇప్పుడు రావణా.. శత్రుశేషణా అంటూ రాముడి పాత్రలతో యుద్ధానికి రెడీ అవుతున్నారు ఇద్దరు బాలీవుడ్ బిగ్గీస్. ప్రభాస్ ని శ్రీరామ చంద్రుడిగా పోట్రెయిట్ చేస్తూ తీస్తున్న ఆదిపురుష్ లో లంకాధిపతిగా సైఫ్ అలీ ఖాన్ ని పిక్ చేసుకున్నారు డైరెక్టర్ ఓం రౌత్. గతంలో తానాజీ మూవీలో నెగిటివ్ క్యారెక్టర్ చేసి సెహబాష్ అనిపించుకున్నారు సైఫ్. అదే కాన్ఫిడెన్స్ తో ఇప్పుడు ఆదిపురుష్ ని ఢీకొట్టబోతున్నారు. పైగా.. ఇది రావణాసురుడి సెంట్రిక్ గా తీసే రాముడి కథ అని ఓ హింట్ కూడా వుంది.

బాహుబలి రైటర్‌ విజయేంద్ర ప్రసాద్‌ రాసిన కథని సీత పేరుతో తెరకెక్కిస్తున్నారు అలౌకిక్‌ దేశాయ్‌. ఇందులో రావణుడి పాత్రకు రణవీర్‌ సింగ్‌ పేరు దాదాపుగా ఖరారైంది. సీతగా కరీనా కపూర్‌ నటిస్తారు. ఇప్పటికే… రాణీ పద్మావతిని చెరబట్టే అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో రణ్వీర్ ని అపర రావణాసురుడిగా చూపెట్టారు కెప్టెన్ భన్సాలీ. ఇప్పుడు సీత మూవీ రణ్వీర్ కి అంతకంటే పెద్ద ఛాలెంజ్. దాదాపు ఒకే టైంలో రావణుడి గెటప్ వేస్తున్న ఇద్దరు స్టార్ హీరోలు…సైఫ్, రణవీర్ కి ఇది అగ్నిపరీక్షే మరి.

Also Read: ‘ఆహా’లో ఉన్నవి, రాబోతున్న మంచి కంటెంట్ సినిమాలు ఇవే..

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాబోవు నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఈ విధంగా నమోదయ్యే అవకాశం