
రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ధురంధర్. యురి ఫేమ్ ఆదిథ్య ధార్ తెరకెక్కించిన ఈ సినిమాలో సారా అర్జున్ కథానాయికగా నటించింది. అలాగే అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ తదితర స్టారాది స్టార్స్ నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలోని పాటలు, సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘ధురంధర్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు రాబడుతున్న ఈ మూవీ గురించి ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సూపర్ హిట్ సినిమాపై నిషేధం విధించారు. ఒకటి కాదు, రెండు కాదు, ఆరు దేశాలు ఈ సినిమాను నిషేధించాయి. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) దేశాలు ఈ నిషేధాన్ని విధించాయి. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ధురంధర్ మూవీలో పాకిస్తాన్ కు వ్యతిరేకంగా సన్నివేశాలు ఉండడంతో ఇస్లామిక్ దేశాలు ఈ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాయి.
గతంలో, ‘స్కై ఫోర్స్’, ‘ఫైటర్’, ‘ఆర్టికల్ 370’, ‘టైగర్ 3’ సినిమాలను కూడ ఈ దేశాలలో నిషేధించారు. అయితే ధురంధర్ చిత్ర బృందం తమకు ఆసమస్య రాకుండా శాయశక్తులా ప్రయత్నించింది. కానీ అది సాధ్యం కాలేదు. సెన్సార్ బోర్డు ఈ సినిమా రిలీజ్ కు అంగీకరించలేదు. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదలైంది. అప్పటి నుండి, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లు, భారతదేశంలో రూ. 200 కోట్లు వసూలు చేసింది. ఈ వారాంతంలో ఈ సినిమా మరిన్ని వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. కాగా చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో రణ్‌వీర్ సింగ్ హిట్ కొట్టాడు. ఈ సినిమా అతని కెరీర్‌కు మంచి మైలేజ్ ఇచ్చింది. వివాదాలు ఉన్నప్పటికీ, సినిమాకు భారీ కలెక్షన్లు సాధిస్తన్నాయి. అయితే ఇప్పుడు నిషేధం కూడా సినిమా కలెక్షన్లపై పెద్దగా ప్రభావం చూపదని తెలుస్తోంది.
Just watched #Dhurandhar. A brilliantly made film filled with fine performances, the finest technical aspects, and amazing soundtracks.
Magnetic presence by my brother @RanveerOfficial, he rocked the show with his versatility.
Charismatic aura by #AkshayeKhanna ji, and the…— Allu Arjun (@alluarjun) December 12, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి