Ranbir Kapoor: ఒక్కో సినిమాకు రూ.50 కోట్లు.. రణబీర్ కపూర్ ఆస్తుల వివరాలు తెలిస్తే షాకే..

రణబీర్ కపూర్.. దివంగత బాలీవుడ్ నటుడు రిషి కపూర్, నీతూ దంపతులకు 1982లో జన్మించాడు. 2007లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన 'సావరియా' రణబీర్ కపూర్ తొలి చిత్రం. హీరో కాకముందు రణబీర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. 'సావరియా' తర్వాత రణబీర్ కపూర్ 'అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ', 'యే జవానీ హై దీవానీ', 'సంజు' వంటి హిట్ సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం 'యానిమల్' సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు. తాజాగా ఈరోజు విడుదలైన ఈ సినిమా టీజర్ అందరినీ ఆకర్షిస్తోంది.

Ranbir Kapoor: ఒక్కో సినిమాకు రూ.50 కోట్లు.. రణబీర్ కపూర్ ఆస్తుల వివరాలు తెలిస్తే షాకే..
Ranbir Kapoor

Updated on: Sep 28, 2023 | 9:27 PM

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్‏కు పాన్ ఇండియా స్థాయిలో మంచి ఫాలోయింగ్ ఉంది. హిందీలో ఇప్పటివరకు అనేక చిత్రాల్లో నటించిన రణబీర్.. ఇప్పటికీ టాప్ హీరోగా కొనసాగుతున్నారు. ఈరోజు (సెప్టెంబర్ 28) రణబీర్ కపూర్ 41వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు ఉదయం నుంచి సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రణబీర్ కపూర్ చాలా ఏళ్లుగా బాలీవుడ్‌లో యాక్టివ్‌గా ఉన్నాడు. ఆయన ఆస్తుల విలువ వందల కోట్ల రూపాయలకు పైగానే ఉన్నాయి. అంతేకాకుండా చాలా చోట్ల అతని పేరు మీద ఆస్తులు ఉన్నాయి. రణబీర్ గ్యారేజీలో ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు రణబీర్ ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసా.

రణబీర్ కపూర్.. దివంగత బాలీవుడ్ నటుడు రిషి కపూర్, నీతూ దంపతులకు 1982లో జన్మించాడు. 2007లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన ‘సావరియా’ రణబీర్ కపూర్ తొలి చిత్రం. హీరో కాకముందు రణబీర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ‘సావరియా’ తర్వాత రణబీర్ కపూర్ ‘అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ’, ‘యే జవానీ హై దీవానీ’, ‘సంజు’ వంటి హిట్ సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం ‘యానిమల్’ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు. తాజాగా ఈరోజు విడుదలైన ఈ సినిమా టీజర్ అందరినీ ఆకర్షిస్తోంది. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తోంది.

ఇదిలా ఉంటే.. రణబీర్ ఒక్కో సినిమాకు 50 కోట్లు తీసుకుంటాడు. అలాగే చాలా బ్రాండ్‌లకు ప్రచార అంబాసిడర్‌గా ఉన్నారు. ఒక్క బ్రాండ్ ప్రమోషన్ కోసం అతను సంవత్సరానికి 6 కోట్ల రూపాయలు తీసుకుంటారట. రణబీర్ కపూర్ మొత్తం ఆస్తులు రూ.345 కోట్లు. రణబీర్ కపూర్‌కు సినిమాపైనే కాకుండా ఫుట్‌బాల్‌పై చాలా ఆసక్తి ఉంది. అలాగ ముంబై FC జట్టు సభ్యుడు కూడా.

రణవీర్ కపూర్ కు ముంబైలోని బాంద్రాలోని వాస్తు భవనంలో రూ.35 కోట్ల 4 BHK ఫ్లాట్‌ని కలిగి ఉన్నాడు. దీనిని షారూఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ డిజైన్ చేశారు. అలాగే పుణెలోని ట్రంప్ టవర్స్ అపార్ట్‌మెంట్‌లో రూ.13 కోట్ల విలువైన లగ్జరీ అపార్ట్‌మెంట్ కూడా ఉంది. రణబీర్ కపూర్‌కి బైక్‌లంటే పిచ్చి. అతనికి రూ.18 లక్షల విలువైన హార్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్‌బాయ్ బైక్ ఉంది. ఈ రెడ్ కలర్ బైక్‌ను కొన్ని సంవత్సరాల క్రితం నటుడు సంజయ్ దత్ రణబీర్ కపూర్‌కు బహుమతిగా ఇచ్చారు.

వాచీలను ఇష్టపడే రణబీర్ కపూర్ వద్ద రూ.50 లక్షల విలువైన రిచర్డ్ మిల్లే RM 010 వాచ్ కూడా ఉంది. ఈ అమూల్యమైన వాచ్‌ను బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఆయనకు బహుమతిగా ఇచ్చారు. అలాగే 8.16 లక్షల విలువైన హబ్లాట్ మెక్సికన్ వాచ్‌ని కలిగి ఉన్నాడు. రూ. 3.25 లక్షల విలువైన TAGHeuer గ్రాండ్ ప్రిక్స్ వాచ్ కూడా ఉంది.

రణబీర్ కపూర్ కు తన తల్లిదండ్రులంటే చాలా ఇష్టం. తండ్రి మరణం తర్వాత అతను చాలాకాలం డిప్రెషన్ లో ఉండిపోయాడు. ఇదిలా ఉంటే.. రణబీర్ కపూర్ సినిమా విషయాలే కాకుండా వ్యక్తిగత వివాదాలతో వార్తల్లో నిలిచాడు. అతన్ని చాలా మంది ప్లే బాయ్ అని కూడా పిలుస్తారు. కత్రినా కైఫ్, దీపికా పదుకొణె మొదలైన వారితో లవ్, బ్రేకప్స్ సాగాయి. ఆ తర్వాత చాలా కాలం హీరోయిన్ అలియా భట్ తో ప్రేమలో ఉన్న రణబీర్.. గతేడాది కుటుంబసభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వీరికి రాహా అనే కుమార్తె ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.