గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తాజాగా హిందీ చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌ను వదిలి హాలీవుడ్‌లో అవకాశాల కోసం అమెరికాకు వెళ్లడం వెనుక గల అసలు కారణాన్ని నటి వెల్లడించారు. ఈ క్రమంలో హాలీవుడ్‌కు ఎందుకు వెళ్లవల్సి వచ్చిందో ప్రియాంక తొలిసారి బహిర్గతం చేశారు. పాడ్‌కాస్ట్ అనే మ్యూజిక్ కంపెనీతో ప్రియాంక ఈ విధంగా మాట్లాడారు..
‘బాలీవుడ్‌లో నన్ను ఓ మూలకు తోసేశారు. నాకు ఎవ్వరూ అవకాశాలు ఇచ్చేవారు కాదు. దీంతో పలువురితో అభిప్రాయభేదాలు వచ్చాయి. వారిలా గేమ్స్ ఆడటం నావల్ల కాదనిపించింది. అక్కడి రాజకీయాలతో విసిగిపోయాను. అందుకే బాలీవుడ్ నుంచి కొంత బ్రేక్ కావాలని అనిపించింది’ అని ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. తాను వదిలేసిన వాటి కోసం ఎప్పుడూ ఆరాటపడలేదని ప్రియాంక ఈ సందర్భంగా తెలిపారు.
కాగా బాలీవుడ్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో తన నటనతో మెప్పించిన ప్రియాంక చోప్రా క్వాంటికో అనే టీవీ సిరీస్‌తో హాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ‘బేవాచ్’, ‘ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్’, ‘వుయ్ కెన్ బీ హీరోస్’, ‘ది వైట్ టైగర్’ వంటి తదితర మువీలతో హాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ‘సిటాడెల్’ అనే వెబ్‌సిరీస్, ‘లవ్ ఎగైన్’ ఇంగ్లిష్ మువీలో ప్రియాంక కనిపించనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.