Tollywood: ఇన్ స్టాలో ఒక్క పోస్ట్‏కు రూ.3 కోట్లు.. షారుఖ్‏ను క్రాస్ చేసిన ఆ హీరోయిన్.. ఎవరంటే..

చాలా మంది సినీతారలు సోషల్ మీడియా ద్వారా భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు. తమ సినిమాల అప్డేట్స్, వ్యక్తిగత విషయాలను ఫాలోవర్లతో షేర్ చేస్తున్నారు. అలాగే పలు బ్రాండ్ ఎండార్స్మెంట్స్ కోసం కూడా తమ ఇన్ స్టా ఖాతాలను ఉపయోగిస్తున్నారు. ఇన్ స్టాలో ఫాలోయింగ్‏ను బట్టి ఎక్కువగానే ఆర్జిస్తున్నారు. అయితే అదే ఇన్ స్టాలో ఒక్క పోస్ట్ చేసినందుకు ఓ హీరోయిన్ ఏకంగా రూ.3 కోట్లు ఆర్జిస్తుందట. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ను సైతం వెనక్కు నెట్టి పెద్ద మొత్తంలో రాబడుతుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ?.

Tollywood: ఇన్ స్టాలో ఒక్క పోస్ట్‏కు రూ.3 కోట్లు.. షారుఖ్‏ను క్రాస్ చేసిన ఆ హీరోయిన్.. ఎవరంటే..
Shah Rukh Khan, Deepika Pad

Updated on: Oct 02, 2023 | 8:59 AM

ప్రస్తుతం జనాలపై సోషల్ మీడియా ప్రభావం ఏ రేంజ్‏లో ఉందో చెప్పక్కర్లేదు. గంటలు గంటలు ఇంటర్నెట్ ప్రపంచంలో మునిగిపోతున్నారు. అయితే సరదాగా చేసే రీల్స్, ఫాలోవర్లతో పంచుకునే ఫోటోలతోనే ఇప్పుడు భారీగా సంపాదిస్తున్నారు. సామాన్య ప్రజలే నెట్టింట ఫుల్ యాక్టివ్‏గా వీడియోస్ చేస్తూ లక్షలకు పైగా సంపాదిస్తుంటే.. సెలబ్రెటీస్ కాస్త ఎక్కువే రాబడుతున్నారు. చాలా మంది సినీతారలు సోషల్ మీడియా ద్వారా భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు. తమ సినిమాల అప్డేట్స్, వ్యక్తిగత విషయాలను ఫాలోవర్లతో షేర్ చేస్తున్నారు. అలాగే పలు బ్రాండ్ ఎండార్స్మెంట్స్ కోసం కూడా తమ ఇన్ స్టా ఖాతాలను ఉపయోగిస్తున్నారు. ఇన్ స్టాలో ఫాలోయింగ్‏ను బట్టి ఎక్కువగానే ఆర్జిస్తున్నారు. అయితే అదే ఇన్ స్టాలో ఒక్క పోస్ట్ చేసినందుకు ఓ హీరోయిన్ ఏకంగా రూ.3 కోట్లు ఆర్జిస్తుందట. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ను సైతం వెనక్కు నెట్టి పెద్ద మొత్తంలో రాబడుతుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ?. తనే గ్లోబల్ స్టార్ ప్రియాంక.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ప్రియాంకకు ఫాలోయింగ్ మాత్రం ఎక్కువగానే ఉంది. ఆమెకు ఇన్ స్టాలో 89.4 మిలయన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంటే.. ఆమె ఒక్కో యాడ్ పోస్ట్ కు రూ.3 కోట్లు సంపాదిస్తుంది. ఇక కింగ్ షారుఖ్ మాత్రం ఒక్కో యాడ్ పోస్ట్ కు రూ.80 లక్షల నుంచి కోటి వరకు అందుకుంటున్నారు. ఆయనకు ఇన్ స్టాలో 42.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. షారుఖ్ తర్వాత అలియా భట్ ఒక్కో పోస్ట్ కు రూ.కోటి.. శ్రద్ధా కపూర్ రూ.1.18 కోట్లు.. దీపికా పదుకొణే.. రూ. 1.5 కోట్లు సంపాదిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే ఈ సంపాదన అనేది వారి ఫాలోయింగ్ బట్టి చూస్తే డిసైడ్ అవుతున్నాయి. అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‏తో వివాహం తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది పీసీ. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ హాలీవుడ్‏లో ఆఫర్స్ అందుకుంటుంది. ఇటీవలే సిటాడెల్ వెబ్ సిరీస్ తో ఆకట్టుకుంది. ఇందులో తన యాక్షన్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ తో అభిమానులు మెప్పించింది. ప్రస్తుతం ఆమె హెడ్స్ ఆఫ్ స్టేట్ షూటింగ్ లో బిజీగా ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.