Pranati Rai Prakash : బాలీవుడ్ నటి , ప్రముఖ మోడల్ ప్రణతి రాయ్ ప్రకాష్ తన తొలి మ్యూజిక్ ఆల్బమ్ ను రిలీజ్ చేసింది. ” తేరా ముస్కురానా” అంటూ ప్రణతి ఆలపించిన పాట సంగీత ప్రియులను ఆకట్టుకుంది. ఈ మ్యూజిక్ వీడియో కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుంది.
“మన్ఫోడ్గంజ్ కి బిన్నీ” తో మంచి నటిగా పేరు తెచ్చుకున్న ప్రణతి రాయ్ ప్రకాష్ “ఫ్యామిలీ ఆఫ్ ఠాకుర్గంజ్”, “లవ్ ఆజ్ కల్” వంటి పలు చిత్రాల్లో నటించింది. తన నటనతో సినీ ప్రేక్షకులను అలరించింది. తన అందం, అభినయంతో ఫ్యాన్స్ హృదయాన్ని కొల్లగొట్టింది. “ఇండియా నెక్స్ట్ టాప్ మోడల్ సీజన్ 2” విజేతగా నిలిచినా తర్వాత ప్రణితి రాయ్ ఈ నటి బాగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు OTT ప్లాట్‌ఫామ్ కోసం పని చేస్తుంది.
ప్రణతి రాయ్ ప్రేమ్ ప్రకాష్ సాధనా రాయ్ దంపతులకు జన్మించింది. ఆమె బీహార్ లోని పాట్నాకు చెందిన యువతి. తండ్రి ఆర్మీ కల్నల్ గా పనిచేస్తున్నారు. తండ్రి ఉద్యోగ రీత్యా ప్రణతి దేశంలోని అనేక ప్రదేశాల్లో జీవించాల్సి వచ్చింది. శ్రీనగర్, పోర్ట్ బ్లేయిర్, భటిండా, మోహు, ఢిల్లీ, తిరువంతపురం, షిల్లాంగ్, డెహ్రాడూన్ వంటి అనేక ప్రాంతాల్లో ప్రణితి నివసించారు. ఇక ముంబైలోని నిఫ్ట్ నుంచి ఫ్యాషస్ కమ్యూనికేషన్ ను పట్టాను పుచ్చుకుంది. ఇక ప్రణతి యోగా, పెయింటింగ్, డిజైనింగ్, వంటి వాటితో నిష్టానితురాలు. ట్రావెలింగ్ ను ఇష్టపడుంది.
బాలీవుడ్ లో నటిగా అడుగు పెట్టక ముందు ప్రణీత మోడలింగ్ రంగంలో పనిచేసింది. అయితే 2015 మిస్ ఇండియా పోటీలో పాల్గొన్న తర్వాత ప్రణితి రాయ్ కు మంచి గుర్తింపు లభించింది. ఫ్రంట్ రన్నర్ గా నిలిచింది. ఇక ప్రణతి ఫెమినా మిస్ ఇండియాలో మిస్ టాలెంటెడ్, మిస్ ఫ్యాషన్ ఐకాన్ మరియు మిస్ బ్యూటిఫుల్ లెగ్స్ టైటిల్స్ గెలుచుకుంది.
Also Read: