Poonam Pandey: బాలీవుడ్‌ హాట్ స్టార్ పూనమ్‌ పాండేను చితకబాదిన భర్త.. పోలీసులకు ఫిర్యాదు..

బాలీవుడ్‌ నటి పూనమ్‌ పాండే భర్త సామ్‌ బాంబే అరెస్ట్‌ అయ్యాడు. పూనమ్‌ ఇచ్చిన ఫిర్యాదుతో అతన్ని అరెస్ట్‌ చేశారు ముంబై పోలీసులు. తన భర్త తనను తీవ్రంగా కొట్టారంటూ..

Poonam Pandey: బాలీవుడ్‌ హాట్ స్టార్ పూనమ్‌ పాండేను చితకబాదిన భర్త.. పోలీసులకు ఫిర్యాదు..
Poonam Pandey With Husband

Updated on: Nov 10, 2021 | 6:21 AM

Poonam Pandey Husband Arrested: బాలీవుడ్‌ నటి పూనమ్‌ పాండే భర్త సామ్‌ బాంబే అరెస్ట్‌ అయ్యాడు. పూనమ్‌ ఇచ్చిన ఫిర్యాదుతో అతన్ని అరెస్ట్‌ చేశారు ముంబై పోలీసులు. తన భర్త తనను తీవ్రంగా కొట్టారంటూ పోలీసులకు కంప్లైంట్‌ చేశారు పూనమ్‌ పాండే. భర్త దాడిలో తీవ్రంగా గాయపడిన పూనమ్‌..ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సామ్‌బాంబే తన ఫస్ట్‌ వైఫ్‌ అల్విరాతో మాట్లాడుతుండటంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అది కాస్తా చినికి చినికి గాలివానలా మారింది. పూనమ్‌పై కోపంతో ఊగిపోయిన సామ్‌ బాంబే..ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు.

ఐతే అంతకుముందు రెండేళ్లు సహజీవనం చేసిన పూనమ్‌, సామ్‌ బాంబే.. ఏడాది క్రితం మూడుముళ్లబంధంతో ఒక్కటయ్యారు. ఐతే పెళ్లయ్యాక కొద్ది రోజులకే ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తి పూనమ్‌పై దాడి చేసేవరకూ వెళ్లింది. దీంతో భర్తపై గృహహింస కేసు కూడా పెట్టింది పూనమ్‌. ఆ తర్వాత రాజీకొచ్చిన శామ్‌బాంబే పూనమ్‌కు క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

నటి పై భర్త దాడి చేయడం ఇదే మొదటిసారి కాదని. గత సంవత్సరం వారి వివాహమైన కొద్ది రోజులకే సామ్ గోవాలో దాడికి పాల్పడ్డాడు. తన భర్త తనను వేధించాడని.. తనపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించాడని పాండే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దక్షిణ గోవాలోని కనకోనా గ్రామంలో ఈ జంట సినిమా షూటింగ్ కోసం సిద్ధమవుతున్నట్లు సమాచారం.

పూనమ్‌ పాండే భర్త సామ్‌ బాంబేపై భారత శిక్షాస్మృతిలోని 353 (బాధ కలిగించడం), 353 (అవమానం) 506 (నేరపూరిత బెదిరింపు),  354 (నిరాడంబరత) కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

ఇవి కూడా చదవండి: Rafale Deal: మధ్యవర్తికి డసాల్ట్‌ ఏవియేషన్‌ రూ.481 కోట్ల లంచం.. మరోసారి తెరపైకి వచ్చిన రాఫెల్‌ డీల్‌ భూతం..

Sania Mirza Video: భర్త షాయబ్ మాలిక్ సిక్సర్ల మోత.. పాక్ క్రికెటర్ ఆటను ఎంజాయ్ చేసిన సానియా..