Aamir Khan: చిక్కుల్లో అమీర్.. మండిపడుతున్న నెటిజన్స్… క్షమాపణ చెప్పాల్సిందేనంటూ డిమాండ్.. ఇంతకీ ఏం జరిగిందంటే..

సినీ పరిశ్రమకు చెందిన స్టార్స్ చిక్కుల్లో పడడం సహజమే.. వారు చేసిన సినిమాలు, వెబ్ సిరీస్‏లపై వివాదాలు జరగడం కామన్. ఈ క్రమంలో

Aamir Khan: చిక్కుల్లో అమీర్.. మండిపడుతున్న నెటిజన్స్... క్షమాపణ చెప్పాల్సిందేనంటూ డిమాండ్.. ఇంతకీ ఏం జరిగిందంటే..
Aamir Khan

Updated on: Oct 02, 2021 | 12:13 PM

సినీ పరిశ్రమకు చెందిన స్టార్స్ చిక్కుల్లో పడడం సహజమే.. వారు చేసిన సినిమాలు, వెబ్ సిరీస్‏లపై వివాదాలు జరగడం కామన్. ఈ క్రమంలో స్టార్స్ పై ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేయడం.. నిరసనలు చేయడం.. చివరకు ఒక మెట్టు దిగి క్షమాపణలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ సమస్యులు తెలుగులోనే కాకుండా.. హిందీ, మలయాళం, తమిళ్ భాషలలోని స్టార్స్ సైతం ఎదుర్కోంటారు. అయితే గత కొద్ది రోజులుగా యాడ్స్ పై కూడా నెటిజన్స్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అలియా భట్ తీసిన కన్యాదాన్ యాడ్ పై ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలియా తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా ఈసారి బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సైతం చిక్కుల్లో పడ్డాడు.

ఆయన చేసిన ఓ యాడ్ ఇప్పుడు తీవ్ర దుమారం నడుస్తోంది. సీయట్ టైర్ల కంపెనీ యాడ్ లో అమీర్ నటించగా.. ఇటీవల ఆ యాడ్ ప్రసారమైంది. రోడ్లు ఉంది టపాసులు కాల్చాడానికి కాదు.. అంటూ తన ఎదురుగా ఉన్న జనాలకు క్లాస్ పీకుతూ.. సదరు టైర్ల యాడ్‏ను ప్రమోట్ చేశాడు. ఈ యాడ్ తమ మనోభావాలను కించపరిచిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. సీయట్‏ను బాయ్‏కాట్ చేయాలంటూ హ్యాష్ ట్యాగ్‏లతో ట్వీట్స్ చేస్తున్నారు. తమకు అమీర్ ఖాన్ క్షమాపణలు చెప్పాలని.. యాడ్‏ను తొలగించాలని సీట్ కంపెనీని డిమాండ్ చేస్తున్నారు. అలాగే.. మతాన్ని,. పండుగలను కించపరిచేలా సీయట్ కంపెనీ యాడ్స్ తీస్తుందని ఆరోపిస్తున్నారు.

యాడ్..

Also Read: Varudu Kavalenu: వరుడు కావలెను నుంచి మరో సాంగ్.. ఆకట్టుకుంటున్న వడ్డాణం పాట..

Rashi Khanna: చేదుగా ఉండే కాఫీ మన మార్నింగ్స్‌ను స్వీట్‌గా ఎలా మారుస్తుందో కదా.! ఆసక్తికరమైన పోస్ట్‌ చేసిన ముద్దుగుమ్మ..

Annatthe: విడుదలకు సిద్ధమైన SP బాలు పాట.. అన్నాత్తే నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే..

Sunishith: సునిశిత్ ఆటకట్టించిన పోలీసులు.. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు.. ఖాకీల జోలికి వస్తే ఊరుకుంటారా మరి..