Nayanthara-Shahrukh Khan: షారుఖ్‌ విషయంలో నయనతార కనిపెట్టిందేంటి? నయన్‌కి హెల్ప్ చేసిందెవరు ?

| Edited By: Rajitha Chanti

Nov 10, 2021 | 1:10 PM

నార్త్ మిమ్మల్ని పిలుస్తోంది అని చాలా మంది చాలా సార్లు చెప్పినా... 'నో ప్రాబ్లమ్‌. నార్తే కదా... వెయిట్‌ చేస్తుందిలే' అన్నంత ధీమాగా

Nayanthara-Shahrukh Khan: షారుఖ్‌ విషయంలో నయనతార కనిపెట్టిందేంటి? నయన్‌కి హెల్ప్ చేసిందెవరు ?
Nayanthara
Follow us on

నార్త్ మిమ్మల్ని పిలుస్తోంది అని చాలా మంది చాలా సార్లు చెప్పినా… ‘నో ప్రాబ్లమ్‌. నార్తే కదా… వెయిట్‌ చేస్తుందిలే’ అన్నంత ధీమాగా కనిపించే వారు నయనతార. నార్త్ లో సినిమాలు చేయకుండా ఆమెను ఆపిందేంటి? ఇప్పుడు నార్త్ వైపు ఆమె వెళ్లడానికి రీజన్‌ ఏంటి? అప్పుడు లేని కాన్ఫిడెన్స్, ఇప్పుడు ఎలా వచ్చినట్టు? వినడానికి సింపుల్‌ క్వశ్చన్స్ అనిపించినా, అంతకు మించిన ఆన్సర్లున్నాయి నయన్‌ దగ్గర.
యస్‌… అట్లీ డైరక్షన్‌లో షారుఖ్‌ హీరోగా నటిస్తున్న సినిమాలో ఇప్పుడు నయన్‌ హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యారు. షారుఖ్‌ ఖాన్‌ కొడుకు ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్స్ కేస్‌లో ఇన్వాల్వ్ కావడంతో ఈ ప్రాజెక్ట్ డిలే అవుతుందని, ఆ తర్వాత షారుఖ్‌ డేట్లకు తగ్గట్టు నయనతార కాల్షీట్లు అడ్జస్ట్ చేయలేక పోతున్నారని, అందుకే ప్రాజెక్ట్ నుంచి తప్పు కుంటున్నారనీ చాలా వార్తలు బయటికొచ్చాయి.

అవన్నీ తూచ్‌ అని చెప్పకనే చెబుతున్నారు మూవీ డైరక్టర్‌ అట్లీ. షారుఖ్‌ సినిమాలో సౌతిండియన్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార చేస్తున్న రోల్‌ గురించి రివీల్‌ చేసి, అందరికీ సడన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారాయన. కేరళ కుట్టి నయనతార ఈ సినిమాలో ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్‌గా కనిపిస్తారన్నది మేకర్స్ నుంచి వస్తున్న మాట.
షారుఖ్‌ ఖాన్‌ ప్రేయసిగానూ, ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్‌గానూ డ్యూయల్‌ షేడ్స్ లో కనిపించనున్నారట ఈ మల్లు బ్యూటీ. ఈ చిత్రంలో షారుఖ్‌ కి తండ్రీ కొడుకులుగా రెండు గెటప్పులుంటాయట. అందులో సీనియర్‌ షారుఖ్‌ గ్రూప్‌లో ప్రియమణి, సాన్యా మల్హోత్రా ఉంటారట. జూనియర్‌ షారుఖ్‌తో నయన్‌ జోడీ కడతారు.

ఎర్లీ డేస్‌లో దుబాయ్‌, ఢిల్లీ, బెంగుళూరులో పెరిగిన నయనతారకి హిందీ లాంగ్వేజ్‌ ప్రాబ్లమ్‌ లేదు. ఆమె హిందీలో చాలా బాగా మాట్లాడతారు. సో ఇప్పుడు నార్త్ లో ఓన్‌ డబ్బింగ్‌ చెప్పుకోవడానికీ ఇంట్రస్ట్ చూపిస్తున్నారట నయన్‌. ఇంతకు ముందుతో పోలిస్తే, నార్త్ కి తగ్గ పర్ఫెక్ట్ ఫిజిక్‌, లేడీ సూపర్‌స్టార్‌ అనే ఇమేజ్‌… ఇవన్నీ తోడు కావడంతో కాన్పిడెన్స్ లెవల్స్ పెరిగాయన్నది నయనతార వైపు నుంచి వినిపిస్తున్న మాట.

విఘ్నేష్‌ శివన్‌ కూడా ఈ విషయంలో నయన్‌కి మోరల్‌ సపోర్ట్ చేస్తున్నారట. నార్త్ మూవీస్‌లోనూ ప్రూవ్‌ చేసుకోగల కెపాసిటీ ఉన్నప్పుడు ఎందుకు వెనక్కి తగ్గాలన్నది విఘ్నేష్‌ రెయిజ్‌ చేసిన పాయింట్‌ అట. సో ఈ విషయం గురించి ఆలోచించిన నయన్‌, అట్లీతో ఉన్న అసోసియేషన్‌తో పాటు, కేరక్టర్‌ కూడా నచ్చడంతో వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారట.
రీసెంట్‌గా అన్నాత్తేలో రజనీకాంత్‌ సరసన ఆమె చేసిన లాయర్‌ కేరక్టర్‌ ఆడియన్స్ కి నచ్చింది. అన్నాత్తేలోనూ నయన్‌ కొన్ని డైలాగులు హిందీలో చెప్పారు. సో నెక్స్ట్ షారుఖ్‌ మూవీకి ఈ విధంగా లీడ్‌ తీసుకున్నారన్నమాట. ఇంతకీ షారుఖ్‌ విషంలో నయనతార ఏం కనిపెడతారు? అందుకు ఎవరి హెల్ప్ తీసుకుంటారు? ఆమె ఎవరికి హెల్ప్ చేస్తారు? వంటివన్నీ ఇప్పటికైతే సస్పెన్స్.

Also Read: Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Sreeleela: ఎట్రాక్ట్ చేస్తున్న అందాల చందమామ శ్రీలీల లేటెస్ట్ ఫోటోస్…

Nora Fatehi: సత్యమేవ జయతే 2 నుంచి కుసు సాంగ్ రిలీజ్.. మరోసారి స్టెప్పులతో అదరగొట్టిన నోరా ఫతేహి..