Nawazuddin Siddiqui: కొంతమంది వ్యక్తి ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు.. సమాజంలో తమకంటూ గుర్తింపు అంబరాన్ని అందుకునే స్టేజ్ చేరుకున్నా కుటుంబ నేపధ్యాన్ని గత జీవితాన్ని మర్చిపోరు.. అలాంటి వ్యక్తుల్లో ఒకరు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిక్. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నవాజుద్దీన్ ప్రస్తుతం వ్యవసాయంలో పూర్తిగా నిమగ్నమైపోయారు. బాలీవుడ్ లో భారీ పారితోషికం అందుకునే నటులలో నవాజుద్ధీన్ సిద్ధిఖీ కూడా ఉంటాడు. ఒక్కో సినిమాకు కనీసం 5 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ అందుకుంటాడని బీ టౌన్ టాక్..
నవాజ్ సొంత ఊరు ఉత్తరప్రదేశ్ లోని బుదానా.. నవాజ్ కు ఇక్కడ పొలాలున్నాయి. ఆయన ఫ్యామిలీ ఇప్పటికీ వ్యవసాయాన్ని చేస్తోంది. లాక్ డౌన్ సమయం నుంచి సినిమా షూటింగ్స్ సరిగ్గా ఉండడం లేదు. దీంతో నవాజ్ తన సొంత ఊరుకు చేరుకున్నారు. అక్కడే తన పొలంలో వ్యవసాయం చేసుకున్నాడు. మళ్ళీ లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత సినిమా షూటింగ్స్ జరిగినప్పుడు సినిమా షూటింగ్స్ హాజరయ్యాడు నవాజ్. సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో షూటింగ్స్ కు సెలవులు వచ్చాయి. దీంతో నవాజ్ మళ్ళీ సొంత ఊరు చేరుకున్నాడు.. ఇప్పుడు వ్యవయసాయం చేస్తున్నాడు. పొలానికి నీరు పెడుతూ.. దుక్కి దున్నుతూ.. ఓ సామాన్య రైతులా పొలంలో పనిచేస్తున్నాడు. అతడు దగ్గరుండి రైతుల చేత పంటలు కూడా వేయించాడు.సిద్ధిక్. ప్రస్తుతం సినిమా షూటింగ్స్ మెల్లగా మొదలైనా.. తన పొలం లోని పంట చేతికి వచ్చే వరకూ తాను ఇక్కడే ఉంటానని నవాజ్ చెప్పాడు. ప్రస్తుతం నవాజుద్దీన్ పొలంలో పనిచేస్తున్న ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
Also Read: Dekhte Reh Jaoge: జీ 5 ఓటిటి వేదికగా కొత్త ప్రచారం.. బ్రాండ్ అంబాసిడర్లుగా సారా అలీ ఖాన్ , అమోల్