Singer KK: ముంబై చేరిన సింగర్ కేకే మృతదేహాం.. నేడు అంత్యక్రియలు.. హాజరుకానున్న సినీ ప్రముఖులు..

Singer KK's Body Reached Mumbai: కేకే మృతదేహాన్ని చివరి చూపు కోసం వెర్సోవాలోని 'పార్క్ ప్లాజా' కాంప్లెక్స్‌లో ఉంచారు. ఈ ప్రముఖ గాయకుడికి గురువారం ఉదయం అంతిమ వీడ్కోలు పలకనున్నారు.

Singer KK: ముంబై చేరిన సింగర్ కేకే మృతదేహాం.. నేడు అంత్యక్రియలు.. హాజరుకానున్న సినీ ప్రముఖులు..
Singer Kk's Body Reached Mumbai
Follow us
Venkata Chari

|

Updated on: Jun 02, 2022 | 5:45 AM

ప్రముఖ గాయకుడు కేకే మృతదేహాన్ని కోల్‌కతా నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ముంబైకి తీసుకొచ్చారు. అతని మృతదేహాన్ని తీసుకుని కుటుంబ సభ్యులు కోల్‌కతా చేరుకున్నారు. ముంబై విమానాశ్రయం నుంచి అతని మృతదేహంతో అంబులెన్స్ అంధేరీ వెర్సోవాలోని ఇంటికి చేరుకుంది. కేకే వెర్సోవాలోని ‘పార్క్ ప్లాజా’ కాంప్లెక్స్‌లో అతని మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఉంచారు. ఈ ప్రముఖ గాయకుడికి గురువారం ఉదయం అంతిమ వీడ్కోలు ఇవ్వనున్నారు. ఉదయం 9 గంటల తర్వాత వెర్సోవా శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కేకే చివరి యాత్రకు సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది ప్రముఖులు హాజరవనున్నట్లు తెలుస్తోంది.

కుటుంబీకులు వచ్చిన తర్వాత పోస్టుమార్టం నిర్వహించారు..

ఇవి కూడా చదవండి

గాయకుడు కేకే కోల్‌కతాలో మంగళవారం రాత్రి మరణించారు. గుండెపోటుతో కుప్పకూలిన తర్వాత, కేకేను ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అతను చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. గాయకుడు కేకే మృతి చెందడంతో ఆయన కుటుంబం బుధవారం ఉదయం కోల్‌కతాకు చేరుకుంది. కొంతమంది సన్నిహిత కుటుంబ సభ్యులతోపాటు అతని భార్య జ్యోతి, ఆయన కుమారుడు, కుమార్తె కూడా కోల్‌కతా చేరుకున్నారు. కేకే కుటుంబం కోల్‌కతా చేరుకున్న తర్వాత, లాంఛనప్రాయాలు పూర్తయింది. ఆ తర్వాతే పోస్ట్‌మార్టం నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం కేకే మృతదేహాన్ని ప్రభుత్వ లాంఛనాలతో ముంబైకి తరలించారు.

నివాళులర్పించిన మమతా బెనర్జీ..

పోస్టుమార్టం అనంతరం కేకే పార్థివదేహాన్ని ఆస్పత్రి నుంచి కోల్‌కతాలోని ప్రముఖ రవీంద్ర సదన్‌కు తరలించారు. అక్కడ కోల్‌కతా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశంలోని ఈ ప్రసిద్ధ గాయకుడికి గన్ సెల్యూట్ చేశారు. మమతా బెనర్జీ ఈ ప్రభుత్వ గౌరవంతో వందనం చేసిన తర్వాత కేకే కుటుంబం.. ఎయిర్ ఇండియా AI 773 విమానంలో అతని భౌతికకాయాన్ని ముంబైకి తీసుకువచ్చింది.

ఫిట్‌నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నా..

గాయకుడు కేకే మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. మే 31న కోల్‌కతా చేరుకున్న కేకే, అతని బృందం.. జీవితంలో ఇదే చివరి సంగీత కచేరీ అని గుర్తించకపోవచ్చు. ఈ కచేరీలో కేకే దాదాపు 20 పాటలు పాడారు. ఈ పాటలలో, “పాల్” పాట అతను పాడిన చివరి పాటగా నిలిచింది. ఆయన మరణవార్తతో ఆయన అభిమానులే కాక దేశ ప్రజలంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎందుకంటే కేకే తన ఆరోగ్యం, ఫిట్‌నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవాడని అంటున్నారు. ఈ విషయంపై సింగర్ రాహుల్.. వైద్య, గీత రచయిత ప్రీతమ్ కూడా మాట్లాడారు. ఈ వార్తతో ఇద్దరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు.