బాలీవుడ్ నటి విద్యా బాలన్‌కు అరుదైన గౌరవం దక్కింది. జమ్మూకశ్మీర్‌లోని ఓ మిలిటరీ ఫైరింగ్ రేంజ్‌కు విద్యా బాలన్‌గా ఇండియన్ ఆర్మీ నామకరణం చేసింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి అందిస్తున్న అసాధారణ సేవలకు గుర్తుగా ఆ ఫైరింగ్ రేంజ్‌కు ఆమె పేరును పెట్టినట్లు భారత సైన్యం తెలిపింది. ఆ ప్రదేశం కశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో ఉంది. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నప్పటికీ.. ఈ అంశంపై విద్యా బాలన్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ ఏడాది ప్రారంభంలో ఇండియన్ ఆర్మీ నిర్వహించిన వింటర్ ఫెప్టివల్‌కు విద్యాబాలన్.. ఆమె భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్‌తో కలిసి హాజరయ్యారు. ఆస్కార్ అవార్డుల పాలకమండలి ‘అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ సైన్సెస్’లో చేరాలంటూ ఆమెకు ఇన్విటేషన్ అందిన విషయం తెలిసిందే. ఆమె నటించిన ‘షేర్నీ’ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో ఇటీవల విడుదలైంది. అందులో ఆమె పోషించిన పాత్రపై ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
తాను మామూలు మధ్యతరగతి నుంచి వచ్చానని, తన కుటుంబంలో ఎవరూ సినిమా బ్యాక్ గ్రౌండ్ కు సంబంధం ఉన్నవాళ్లు లేరని గతంలో విద్యాబాలన్ తెలిపింది. మొదట యాడ్స్ లో నటించానన్న ఈ సుందరి.. టాలెంట్ ఉన్నప్పటికీ రీజన్ చెప్పకుండానే తనను పక్కన పెట్టేవారని బాధను వ్యక్తం చేసింది. 2002లో మాధవన్ హీరోగా తెరకెక్కిన ‘రన్’ సినిమాలో మొదట హీరోయిన్‌గా విద్యాబాలన్‌ను తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె ప్లేస్‌లో మీరా జాస్మిన్‌ను ఎంపిక చేశారు. ఆ తదుపరి కూడా కొన్ని సినిమాల్లో విద్యాబాలన్‌కు అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారాయి. బాలీవుడ్‌లో ‘పరిణీత’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విద్యా… ‘డర్డీ పిక్చర్స్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకుంది. తెలుగులో ఈ భామ బాలకృష్ణ హీరోగా నటించిన‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో నందమూరి బసవతారకం పాత్రలో నటించింది.
Also Read: కరోనా బాధిత గవర్నమెంట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్..!