Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aishwarya Rai: రోజూ చేపలు తినండి.. మీ కళ్లు ఐశ్వర్యారాయ్‌లా అందంగా మెరుస్తాయ్.. బీజేపీ మంత్రి షాకింగ్‌ కామెంట్స్‌

మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు రోజుకో కారణంతో వార్తల్లో నిలుస్తున్నారు. రెండు రోజుల క్రితం షిండే వర్గానికి చెందిన భరత్ గోగవ్లే ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎలా వచ్చాయో వెల్లడించి షిండే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాడు. ఇప్పుడు గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి డా. విజయ్‌కుమార్ గవిత్ ఓ ప్రకటన చేసి మరో వివాదంలో ఇరుక్కున్నారు.

Aishwarya Rai: రోజూ చేపలు తినండి.. మీ కళ్లు ఐశ్వర్యారాయ్‌లా అందంగా మెరుస్తాయ్.. బీజేపీ మంత్రి షాకింగ్‌ కామెంట్స్‌
Vijaykumar Gavit, Aishwarya Rai Bachchan
Follow us
Basha Shek

|

Updated on: Aug 21, 2023 | 6:30 PM

మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు రోజుకో కారణంతో వార్తల్లో నిలుస్తున్నారు. రెండు రోజుల క్రితం షిండే వర్గానికి చెందిన భరత్ గోగవ్లే ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎలా వచ్చాయో వెల్లడించి షిండే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాడు. ఇప్పుడు గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి డా. విజయ్‌కుమార్ గవిత్ ఓ ప్రకటన చేసి మరో వివాదంలో ఇరుక్కున్నారు. బాలీవుడ్‌ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఎక్కువగా చేపలు తింటారని, అందుకే ఆమె కళ్లు, స్కిన్‌ టోన్‌ ఎంతో అందంగా ఉంటాయని షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ‘మీరు ఐశ్వర్యరాయ్‌ని చూశారా? ఆమె కళ్లూ ఎంతో అందంగా ఉంటాయి. దీనికి కారణం చేపలే. ఐశ్వర్య కర్ణాటకలోని మంగళూరు తీర ప్రాంతంలో పుట్టి పెరిగింది. రోజూ చేపలు తినడం వల్లే ఆమె కళ్లు చాలా అందంగా మెరిసిపోతున్నాయి. చేపలు తినడం వల్ల ప్రధానంగా రెండు ప్రయోజనాలు ఉన్నాయి. స్త్రీలు నాజుకుగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. చేపలలో లభించే నూనె వల్ల ఇది సాధ్యమవుతుంది. ఐశ్వర్యారాయ్  లా మీరు రోజూ చేపలు తినండి. . మీ కళ్లు, చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోండి’ అని విజయ్ కుమార్ గావిట్ కాంట్రవర్సీ కామెంట్స్‌ చేశారు మహారాష్ట్ర మంత్రి.

అమ్మాయిల మనసులు గెల్చుకోండి..

మహారాష్ట్రలోని ధులే జిల్లాలో మత్స్యకారుల సంఘం తరపున ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో విజయ్‌కుమార్‌ గవిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన విజయ్‌కుమార్‌ గవిత్ చేపలు బాగా తినాలని యువతకు సూచించారు. అలాగే చిన్నపిల్లలు, అమ్మాయిలు కూడా చేపలు తింటే కళ్లు కూడా అందంగా ఉంటాయన్నారు. ఇక కుర్రాళ్లు కూడా అమ్మాయిల మనసులను సులువుగా గెలుచుకోవచ్చని కామెంట్స్‌ చేశారు. మంత్రి వ్యాఖ్యలకు అక్కడున్న వారందరూ నోరెళ్ల బెట్టారు. ఇక దీనికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది.

ఇవి కూడా చదవండి

గతంలోనూ వివాదాలు..

కాగా విజయ్ కుమార్ గవిత్ నందుర్బార్ నుండి బీజేపీ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఉత్తర మహారాష్ట్రలో శక్తివంతమైన గిరిజన నాయకుడిగా విజయ్‌కుమార్‌కు గుర్తింపు ఉంది. ఆయనతో పాటు ఆయన కుమార్తె హీనా గవిత్ నందుర్బార్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఇక బీజేపీలో చేరకముందు గవిత్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గవిత్ ఇంతకు ముందు కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.

ఐశ్వర్యారాయ్‌ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ 

ఐశ్వర్యారాయ్‌ కూతురు ఫొటోస్

ఐశ్వర్యారాయ్‌ ఫ్యామిలీ ఫొటోస్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.