Bharti Singh: అబ్బాయికి జన్మనిచ్చిన లేడీ కమెడియన్.. ఆనందాన్ని పంచుకుంటూ నెట్టింట్లో పోస్ట్..
Bharti Singh: ది కపిల్ శర్మ షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్న భారతీ సింగ్ తల్లిగా ప్రమోషన్ పొందింది. ఆదివారం ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
Bharti Singh: ది కపిల్ శర్మ షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్న భారతీ సింగ్ తల్లిగా ప్రమోషన్ పొందింది. ఆదివారం ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కాగా తాము తల్లిదండ్రులమయ్యామంటూ భారతీ – హర్ష్ లింబాచియా దంపతులు సోషల్ మీడియా వేదికగా ఈ శుభవార్తను పంచుకున్నారు. ‘మాకు అబ్బాయి పుట్టాడోచ్..’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. దీంతో బాలీవుడ్ సెలబ్రిటీలు భారతీ సింగ్ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కరణ్ జోహార్, పరిణీతి చోప్రా, నేహా కక్కర్, అనిత హస్సానందిని, అష్నూర్ కౌర్, ఈషాగుప్తా, అదితీ భాటియా తదితరులు విషెస్ చెబుతూ హార్ట్, లవ్ ఎమోజీలతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా అబ్బాయి పుట్టాడంటూ సంతోషాన్ని షేర్ చేసుకున్న భారతీ తనయుడి ఫొటోను మాత్రం రివీల్ చేయలేదు.
కాగా ది కపిల్ శర్మ షో లో లల్లీ అనే పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది భారతీసింగ్. తన కామెడీ పంచులతో బుల్లితెర ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతోంది. దీంతో పాటు కామెడీ సర్కస్, ఝలక్‌దిక్లాజా, బిగ్‌బాస్, నచ్‌బలియే, ఖత్రోన్ కే ఖిలాడీ, డ్యాన్స్ దీవానే తదితర రియాలిటీ షోలతో బాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైంది. దీంతో పాటు కొన్ని హిందీ, పంజాబీ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ఇక భారతీ వ్యక్తిగత జీవితానికి వస్తే.. హర్ష్ లింబాచియాను 2017 డిసెంబర్ 3న ప్రేమ వివాహం చేసుకుంది.
View this post on Instagram
View this post on Instagram
Also Read:కియారా అద్వానీ ఎంట్రీ చుసిన చూపుతిప్పుకోలేని కుర్రకారు…
Viral Video: రెండు ట్రక్కుల మధ్య నలిగి నుజ్జనుజ్జయిన కారు.. ఒకరు మృతి.. లైవ్ వీడియో