AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Katrina Kaif: వామ్మో.. ఈసారి గుర్తుపట్టడం కష్టమే.. మరోసారి డీప్ ఫేక్ వీడియోకు బలైన కత్రినా కైఫ్..

గతంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో ఎంతగా వైరలయ్యిందో తెలిసిందే. సోషల్ మీడియా తార జరా పటేల్ వీడియోకు రష్మిక ముఖాన్ని జత చేసిన వీడియోపై సినీ, రాజకీయ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత అలియా భట్, నోరా ఫతేహీ, సోనూ సూద్, కత్రినా కైఫ్ వంటి తారల డీప్ ఫేక్ వీడియోస్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే తమ డీప్ ఫేక్ వీడియోస్ గురించి స్పందిస్తూ.. ఇలాంటి వీడియోస్ నమ్మవద్దని అభిమానులకు తెలియజేశారు.

Katrina Kaif: వామ్మో.. ఈసారి గుర్తుపట్టడం కష్టమే.. మరోసారి డీప్ ఫేక్ వీడియోకు బలైన కత్రినా కైఫ్..
Katrina Kaif
Rajitha Chanti
|

Updated on: Jan 24, 2024 | 7:53 AM

Share

సోషల్ మీడియాలో ఏఐ ఫోటోస్, వీడియోస్ ఎంతగా వైరలవుతున్నాయో చెప్పక్కర్లేదు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ సాయంతో నెట్టింట ఎన్నో మ్యాజిక్స్ చేస్తున్నారు. ఇప్పటికే శోభన్ బాబు, మహానటి సావిత్రి ఏఐ వీడియోస్ నెటిజన్లను ఆకట్టుకున్నాయి. అయితే కొందరు ఆకతాయిలు ఈ టెక్నాలజీని మరో కోణంలో ఉపయోగిస్తున్నారు. పలువురు స్టార్ నటీనటుల ముఖాలతో అసభ్యకరమైన వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు. గతంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో ఎంతగా వైరలయ్యిందో తెలిసిందే. సోషల్ మీడియా తార జరా పటేల్ వీడియోకు రష్మిక ముఖాన్ని జత చేసిన వీడియోపై సినీ, రాజకీయ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత అలియా భట్, నోరా ఫతేహీ, సోనూ సూద్, కత్రినా కైఫ్ వంటి తారల డీప్ ఫేక్ వీడియోస్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే తమ డీప్ ఫేక్ వీడియోస్ గురించి స్పందిస్తూ.. ఇలాంటి వీడియోస్ నమ్మవద్దని అభిమానులకు తెలియజేశారు. కానీ ఇప్పుడు మరోసారి డీప్ ఫేక్ వీడియోకు బలయ్యింది బీటౌన్ బ్యూటీ కత్రినా కైఫ్.

ప్రస్తుతం సోషల్ మీడియాలో కత్రినా కైఫ్ మరో డీప్ ఫేక్ వీడియో వైరలవుతుంది. అందులో ఆమె అనర్గళంగా టర్కిష్ మాట్లాడుతూ కనిపించింది. నిజానికి ఈ వీడియో 2014లో హృతిక్ రోషన్, కత్రినా కలిసి నటించిన బ్యాంగ్ బ్యాంగ్ మూవీని ప్రమోట్ చేస్తున్నప్పుడు ఓ ఇంటర్వ్యూలోనిది. ఈ వీడియోలో కత్రినా టర్కిష్ మాట్లాడుతున్నట్లు డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా ఎడిట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. నెటిజన్స్ విభిన్నంగా స్పందిస్తున్నారు.

గతేడాది వచ్చిన టైగర్ 3 యాక్షన్ మూవీలో కత్రినా నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో టవల్ ఫైట్ సన్నివేశంలోని స్టిల్స్ డీప్ ఫేక్ ద్వారా మార్ఫింగ్ చేశారు. అయితే కొన్ని గంటల్లోనే రష్మిక డీప్ ఫేక్ వీడియోస్ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ నుంచి తొలగించారు. టైగర్ 3 చిత్రంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.