బాలీవుడ్ ప్రముఖ నటి కరీనా కపూర్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆమె గత 20 ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉంది. ఈ సీనియర్ నటికి మరో 10 రోజుల్లో అతనికి 44 ఏళ్లు వస్తాయి. అయితే ఈ మధ్యన సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ జరుగుతోంది.చాలామంది ఆమెను అమ్మమ్మ, ఆంటీ అని పిలుస్తున్నారు. అయితే ఈ ట్రోలింగ్ గురించి తాను పట్టించుకోనంది కరీనా కపూర్. ఇదే విషయంపై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘నేను చేయాలనుకున్నదంతా చేశాను. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ నా పనిని మెచ్చుకున్నారు. నేనెప్పుడూ హాలీవుడ్ సినిమా చేయాలనీ, ఇంగ్లీషు సినిమా చేయాలనీ అనుకోలేదు. అర్థవంతమైన పని చేయడం, నాతో నిజాయితీగా ఉండటమే నా లక్ష్యం. నేను ఇప్పుడు ఉన్న స్థితిలో సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు మీడియా కవరేజీ వేరు. పర్ఫెక్ట్‌గా కనిపించాలనే ఒత్తిడి ఉంటుంది. నా యుక్తవయస్సులో నేను పంజాబీ కపూర్‌ని. ఇప్పుడు నేను అన్ని రకాల టెన్షన్స్ ను మర్చిపోయాన. సంతోషకరమైన జీవితాన్ని ఆనందిస్తున్నాను. మంచి మార్గంలో ఉండాలన్నదే నా ఉద్దేశం’ అని కరీనా కపూర్ చెప్పుకొచ్చింది
‘యవ్వనంగా కనిపించడం కాదు లక్ష్యం. నా వయస్సు 44 సంవత్సరాలు. నా భర్తకు నేను చాలా హాట్ గా కనిపిస్తున్నాను. నా స్నేహితులు ఇప్పటికీ నన్ను ప్రశంసిస్తున్నారు. నా సినిమాలు విజయం సాధిస్తున్నాయి. నా వయసుకు తగ్గట్టుగా పాత్రల్లో నటిస్తున్నాను. అభిమానులు నన్ను నేనుగా చూడడానికి ఇష్టపడుతున్నారు’ అని కరీనా కపూర్ తెలిపారు.
Bebo coming to big screen with high intense thriller #TheBuckinghamMurders . Movie getting rave reviews after previews#KareenaKapoorKhan ❤️ pic.twitter.com/vRwwpJhV4W
— muzz💤 (@MushtieQ) September 12, 2024
ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల కరీనా కపూర్ నటించిన ‘క్రూ’ భారీ విజయాన్ని సాధించింది. ఇందులో కామెడీ, సస్పెన్స్ అన్నీ ఆంశాలు ఉన్నాయి. దీని తర్వాత హన్సల్ మెహతా దర్శకత్వంలో కరీనా కపూర్ నటించిన ‘బకింగ్‌హామ్ మర్డర్స్’ సెప్టెంబర్ 13న విడుదల కానుంది.
In Cinemas from tomorrow! Kareena Kapoor stars in crime thriller, The Buckingham Murders (In Hindi), showing at Piccadilly Cinema Leicester from tomorrow. Advance bookings are available now, book at:https://t.co/A4rxdTgwGB#TheBuckinghamMurders #kareenakapoor pic.twitter.com/oVVXLZOHxR
— Piccadilly Cinema (@PiccadillyCine) September 12, 2024