Emergency Movie: ఎమర్జెన్సీ హిట్ అయినా… సినిమాలపై కంగనా సంచలన నిర్ణయం.. షాక్‌లో ఫ్యాన్స్

|

Jan 10, 2025 | 11:20 AM

కంగనా రనౌత్ నటించిన "ఎమర్జెన్సీ" ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా తర్వాతి ప్రాజెక్టులపై కంగనా సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు.

Emergency Movie: ఎమర్జెన్సీ హిట్ అయినా... సినిమాలపై కంగనా సంచలన నిర్ణయం.. షాక్‌లో ఫ్యాన్స్
Kangana Ranaut
Follow us on

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కథానాయికగా నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా రిలీజ్ ట్రైలర్ ఇటీవల విడుదలైంది. దీనికి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రియాంక గాంధీకి కూడా ఈ ట్రైలర్ బాగా నచ్చిందని కంగనా సినిమా ప్రమోషన్లలో చెప్పుకొచ్చింది. ఎమర్జెన్సీ సినిమా పక్కా పొలిటికల్ కథ. ఈ సినిమా విడుదలకు కంగనా చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. అందుకే సమీప భవిష్యత్తులో రాజకీయాలకు సంబంధించిన కథలు చేయకూడదని ఆమె నిర్ణయించుకుంది. ‘ఎమర్జెన్సీ’ సినిమాపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు మొదట నిరాకరించింది. పంజాబ్‌కు చెందిన శిరోమణి అకాలీదళ్ కూడా సినిమాపై వ్యతిరేకత వ్యక్తం చేసింది. సినిమా సిక్కు సమాజాన్ని అవమానించేలా ఉందని ఆరోపించారు. ఈ క్రమంలోనే కంగనా తన తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడింది.

‘మరోసారి రాజకీయ ఆలోచనలతో సినిమాలు చేయను. ఇలాంటి చిత్రాలు తీయడం చాలా కష్టమైంది. క‌థ‌పై, ముఖ్యంగా ప్ర‌జ‌ల గురించి ఎక్కువ సినిమాలు ఎందుకు తీయ‌లేదో ఇప్పుడు నాకు తెలిసింది. అనుమప్ ఖేర్ యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ చిత్రాన్ని రూపొందించారు. ఇది అతని బెస్ట్ సినిమా. కానీ, మళ్లీ ఇలాంటి సినిమాలు చేయను. ఈ సినిమా విజయం సాధించినప్పటికీ భవిష్యత్తులో రాజకీయ కథాంశాలతో కూడిన సినిమాలు చేయను’ అని కంగనా చెప్పుకొచ్చింది. దీంతో ఆమె కామెంట్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కాగా ఇప్పుడు సినిమాలతో పాటు కంగనా ఎంపీగా బిజీ బిజీగా ఉంటున్నారు. మర్జెన్సీ సినిమాలో కంగనా నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించింది. నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. ‘సెట్‌లో నేనెప్పుడూ సహనం కోల్పోలేదు. మీరే నిర్మాతగా ఉన్నప్పుడు సెట్‌లో సహనం కోల్పోతారా? నిర్మాతతో దర్శకుడు కొట్లాడుతాడు. కానీ, రెండు పనులూ నువ్వే చేస్తున్నప్పుడు అరవలేవు’ అంటోంది కంగనా.

ఇవి కూడా చదవండి

 

 

ఎమర్జెన్సీ సినిమాలో కంగనా రనౌత్..

 

 

కంగనా రనౌత్ ఇప్పుడు ఎంపీ. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ తరపున పోటీ చేసి గెలిచారు. రాజకీయాల్లో రాణిస్తే సినీ పరిశ్రమ నుంచి తప్పుకుంటానని అన్నారు. అది నిజమవుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం కంగనా కొత్త సినిమా ఏదీ ప్రకటించలేదు. ఇది కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. మరి ఆయన తదుపరి నిర్ణయాల గురించి ‘ఎమర్జెన్సీ’ విడుదల తర్వాత తెలుస్తుంది.

కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమా ట్రైలర్..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.