‘బజరంగీ భాయిజాన్ 2’ ఉన్నట్లా లేనట్లా.. సల్మాన్‌ ప్రకటన అబద్దమేనా..?

| Edited By: Ravi Kiran

Dec 21, 2021 | 7:23 AM

Bajrangi Bhaijaan 2: 2015లో సల్మాన్ ఖాన్ అత్యంత విజయవంతమైన చిత్రం 'బజరంగీ భాయిజాన్'. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌ గురించి చర్చ

బజరంగీ భాయిజాన్ 2 ఉన్నట్లా లేనట్లా.. సల్మాన్‌ ప్రకటన అబద్దమేనా..?
Bajrangi
Follow us on

Bajrangi Bhaijaan 2: 2015లో సల్మాన్ ఖాన్ అత్యంత విజయవంతమైన చిత్రం ‘బజరంగీ భాయిజాన్’. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌ గురించి చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ సినిమా గురించి సల్మాన్ ఖాన్ స్వయంగా మాట్లాడారు. ఈ చిత్రానికి సీక్వెల్ త్వరలో తీయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ‘బజరంగీ భాయిజాన్’ తీసిన దర్శకుడు కబీర్ ఖాన్ వేరే విషయం చెబుతున్నారు. ఈ సినిమా సీక్వెల్‌ గురించి తీవ్రంగా ఖండించారు. దీంతో సల్మాన్‌ అభిమానులు నిరాశకు లోనవుతున్నారు.

నిజానికి సల్మాన్‌ఖాన్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘బజరంగీ భాయిజాన్‌’ సీక్వెల్‌ తీయబోతున్నారని, ఆ సినిమా కథను మొదటి పార్ట్‌ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ రాస్తారని మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. PTI ప్రకారం ముంబైలో RRR చిత్రం కార్యక్రమం సందర్భంగా సల్మాన్ ఖాన్ బజరంగీ భాయిజాన్ సీక్వెల్‌ గురించి మాట్లాడారు. త్వరలో సీక్వెల్‌ ఉంటుందని దాని కథను SS రాజమౌళి తండ్రి K విజయేంద్ర ప్రసాద్‌ రాస్తారని ప్రకటించారు. అయితే ఈ సినిమా గురించి ఇంకా ఎలాంటి ఆలోచన చేయలేదని దర్శకుడు చెబుతున్నారు.

డైరెక్టర్‌ కబీర్ ఖాన్ మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్ ప్రకటించినా స్క్రిప్ట్ ఇంకా రాయలేదు. అసలు సీక్వెల్ ఆలోచనే జరుగలేదు. ఇప్పుడు దానిగురించి మాట్లాడుకునేందుకు ఏమిలేదని స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి కరణ్ జోహార్ హోస్ట్ చేసిన కార్యక్రమంలో సల్మాన్ మాట్లాడుతూ.. రాజమౌళి, అతని తండ్రితో తనకు దగ్గరి సంబంధం ఉందని అతను బజరంగీ భాయిజాన్ 2 కథను రాసినట్లుగా త్వరలో మేము సీక్వెల్‌ చేస్తున్నట్లుగా తెలిపారు.

సల్మాన్ ఖాన్, కబీర్ ఖాన్ కలిసి 2015లో బజరంగీ భాయిజాన్‌ని రూపొందించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. సల్మాన్‌కి అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా ఇదే. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం తన టైగర్ 3 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇందులో అతనితో కత్రినా కైఫ్ నటిస్తోంది. మరోవైపు కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ’83’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై జోరుగా ప్రచారం జరుగుతోంది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా 24 డిసెంబర్ 2021న థియేటర్లలో విడుదల కానుంది.

Electric Cars: ఎలక్ట్రిక్‌ కార్ల కొనుగోలుపై పన్ను మినహాయింపు.. ఎంత ప్రయోజనం పొందవచ్చంటే..?

పోలీసులు లంచం తీసుకుంటే పని కచ్చితంగా చేస్తారట.. ఈ విషయం పోలీస్‌ అధికారే చెబుతున్నాడు.. వీడియో చూడండి..

BEL Recruitment 2021: మచిలీపట్నంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి..