Money laundering : బాలీవుడ్‌లో రోజుకో రచ్చ జరుగుతుంది. ఇప్పటికే డ్రగ్స్ వ్యవహారంతో సతమతం అవుతున్న హిందీ ఇండస్ట్రీలో ఇప్పుడు మరో వ్యవహారం కలకలం సృష్టిస్తుంది. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇప్పుడు కొత్త చిక్కుల్లో పడింది. మనీ లాండరింగ్ కేసులో జాక్వలిన్‌కు నోటీసులు పంపారు ఈడీ అధికారులు. విచారణకు హాజరు కావాలని సూచించినప్పటికీ ఈ భామ దాన్ని లైట్ తీసుకుంది. ఇప్పటివరకు నాలుగు సార్లు విచారణకు డుమ్మా కొట్టింది జాక్వలిన్. ఈ కేసులో జాక్వెలిన్ నాలుగోసారి కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కాలేదు. గతంలో మూడు సార్లు కూడా హాజరుకాని జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. తాజాగా సోమవారం కూడా విచారణకు హాజరుకాలేదు. ఇదిలా ఉంటే నేడు (బుధవారం ) ఎట్టకేలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు జాక్వలిన్ హాజరయ్యింది. సుఖేష్ చంద్ర శేఖర్‌తో ఉన్న సంబంధాలపై జాక్వలిన్‌ను విచారించారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.
ఇక సుఖేష్ చంద్రశేఖర్ పై 200కోట్ల కుంభకోణం ఆరోపణలు ఉన్నాయి. సుఖేష్ చంద్రశేఖర్, ఆయన భార్య లీనా పౌల్‌పై నమోదైన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే బాలీవుడ్ నటి నోరాఫతేహి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఈడీ అధికారులు నోటీసులు పంపారు. కాగా ఈ కేసులో ఇప్పటికే ఈడీ.. ఆమె వాంగ్మూలాన్ని ఆగస్టు 30వ తేదీన నమోదు చేసుకుంది. నాటి నుంచి ఫెర్నాండెజ్ విచారణకు హాజరుకావడం లేదు. ఈ మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే సుఖేష్ చంద్రశేఖర్, లీనా పౌలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రముఖ వ్యాపార వేత్త శివేందర్ సింగ్ భార్య అథితి సింగ్ ఫిర్యాదు మేరకు వీరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే నోరా ఫాతేహిను కూడా అధికారులు ప్రశ్నించి.. వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :