
హృతిక్ రోషన్, దీపికా పదుకొనే జంటగా ‘ఫైటర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాను జనవరి 25న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పోస్టర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ‘వార్’, ‘పఠాన్’ వంటి సూపర్ హిట్ యాక్షన్ చిత్రాలను అందించిన సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాకు కూడా డైరెక్షన్ చేస్తున్నారు. ‘ ఫైటర్ ‘ సినిమా బడ్జెట్ దాదాపు 250 కోట్లు అని తెలుస్తోంది. ఈ సినిమాలో హృతిక్, దీపిక సహా చాలా మంది స్టార్ నటులు నటిస్తున్నారు. ఈ సినిమా కోసం నటీనటులు భారీ రెమ్యూనరేషన్‌ను అందుకున్నారని తెలుస్తోంది.
సిద్ధార్థ్ ఆనంద్ గతేడాది ‘పఠాన్’ చిత్రానికి దర్శకత్వం వహించి భారీ విజయం సాధించారు. షారుక్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సినిమా గతేడాది జనవరి 25న విడుదలైంది. ఇప్పుడు సరిగ్గా ఏడాది తర్వాత సిద్ధార్థ్ ‘ఫైటర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అద్భుతమైన యాక్షన్ ఉండనుంది. ఈ చిత్రానికి గాను ఆర్టిస్టులు ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారనే టాక్ ఇప్పుడు బాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తుంది. ఇటీవల హృతిక్ రోషన్ యాక్షన్ సినిమాలకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ‘ఫైటర్’ చిత్రానికి హృతిక్ రోషన్ రూ.50 కోట్లు అందుకున్నట్లు సమాచారం. ‘వార్ ’ సినిమా తర్వాత హృతిక్ రోషన్ కు డిమాండ్ పెరిగింది. గతేడాది విడుదలైన ‘విక్రమ్ వేద’ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. ఈ సినిమాకి కూడా 50 కోట్లు అందుకున్నాడు. ‘ఫైటర్’ సినిమా కోసం హృతిక్ తన రెమ్యునరేషన్ పెంచలేదని అంటున్నారు. సినిమా హిట్ అయ్యి భారీ కలెక్ట్ చేస్తే అందులో హృతిక్ షేర్ తీసుకునే అవకాశం ఉందని టాక్.
పెళ్లయ్యాక చాలా మంది నటీమణులు సినిమా రంగానికి దూరంగా ఉంటున్నారు. కొంతమంది పెళ్లయ్యాక బోల్డ్‌గా కనిపించడానికి వెనుకాడతారు. కానీ, దీపిక అలా కాదు. పెళ్లయిన తర్వాత కూడా సినిమాలు చేస్తూ చాలా బోల్డ్‌గా కనిపిస్తోంది. 2023లో దీపిన నటించిన ‘పఠాన్’, ‘జవాన్’ చిత్రాలు విజయం సాధించాయి. 2024 ప్రారంభంలో ‘ఫైటర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు గాను ఆమె రెమ్యూనరేషన్ 16 కోట్ల రూపాయలు అందుకుంటుందని టాక్. ‘పఠాన్’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దీపిక తన పారితోషికాన్ని పెంచేసింది. ఇక ‘యానిమల్’ సినిమాతో అనిల్ కపూర్ కి ఇంకా డిమాండ్ పెరిగింది. ‘ఫైటర్’ సినిమాలోనువు అనిల్ ఓ ముఖ్య పాత్రలో నటించాడు. ఈ పాత్ర కోసం అనిల్ కపూర్ 7-10 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. అలాగే కరణ్ సింగ్ గ్రోవర్ ఈ సినిమాలో నటించినందుకు కోటి రూపాయల పారితోషికం అందుకున్నాడట. అదే విధంగా అక్షయ్ ఒబెరాయ్ దాదాపు కోటి రూపాయలు అందుకున్నాడని టాక్ ఫైటర్ సినిమా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కూడా భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..