Ranveer Singh Birthday: రణవీర్ ఫస్ట్ యాక్టింగ్ క్లాసు.. అతడు ఏం చేశాడో చూస్తే మీరూ నవ్వాపుకోలేరు.!

|

Jul 06, 2021 | 11:59 AM

Ranveer Singh Birthday: యశ్ రాజ్ ఫిలింస్ 2010లో నిర్మించిన బ్యాండ్ బాజా బారత్ సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేశాడు రణ్‏వీర్.

Ranveer Singh Birthday: రణవీర్ ఫస్ట్ యాక్టింగ్ క్లాసు.. అతడు ఏం చేశాడో చూస్తే మీరూ నవ్వాపుకోలేరు.!
Ranveer Singh
Follow us on

Ranveer Singh Birthday: యశ్ రాజ్ ఫిలింస్ 2010లో నిర్మించిన బ్యాండ్ బాజా బారత్ సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేశాడు రణ్‏వీర్. ఇందులో రణ్‏వీర్ సరసన అనుష్క శర్మ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయం సాధించడమే కాకుండా.. విమర్శకులు ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలోని నటనగాను.. రణ్‏వీర్ ఫిలింఫేర్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. మొదటి సినిమా తర్వాత రణ్‏వీర్ కు బాలీవుడ్ లో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తర్వాత వరుసగా సూపర్ హిట్ సినిమాలను చేస్తూ.. రణ్‏వీర్ బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా ఎదిగారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‏వీర్ సింగ్ పుట్టిన రోజు నేడు (జూలై 6). ఈ సందర్భంగా ఈ స్టార్ హీరోకు సంబంధించిన ఓ రేర్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

రణ్‏వీర్ సింగ్ మొదట ఓ యాడ్ ఏజెన్సీలో కాపీరైటర్‏గా చేరాడు. అందులో పనిచేస్తూనే సినిమా అవకాశాల కోసం తిరగడం ప్రారంభించాడు. అందులో భాగంగానే రణ్‏వీర్ సింగ్ యాక్టింగ్ స్కూల్లో కూడా జాయిన్ అయ్యాడట. అయితే మొదటి యాక్టింగ్ క్లాసులో రణ్‏వీర్ ప్రవర్తించిన తీరు అక్కడి వారికి నవ్వు తెప్పించింది. మొదటి రోజు కావడంతో.. రణ్‏వీర్ తన కామెడిగా స్టెప్పులెస్తూ.. అక్కడున్నవారిని నవ్వించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో రణ్‏వీర్ సన్నగా అసలు గుర్తుపట్టడానికి వీల్లెకుండా ఉన్నాడు.

ట్వీట్..

 

ఇక రణ్‏వీర్ సింగ్ పుట్టిన రోజు సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2018లో బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొణెను ప్రేమ వివాహం చేసుకున్నాడు రణ్‏వీర్ సింగ్.

Also Read: Karthika Deepam: కార్తీక్ నిర్దోషి నమ్మమని దీప కి చెబుతున్న సౌందర్య.. దీపకి పెళ్లి బట్టలు పెట్టడానికి రెడీ అవుతున్న మోనిత

Balanagar Flyover: అందుబాటులోకి వచ్చిన బాలానగర్‌ ప్లై ఓవర్‌.. మన్సిపల్ కార్మికురాలితో రిబ్బన్ కట్ చేయించిన మంత్రి కేటీఆర్

కస్టడీ నుంచి క్రిమినల్స్ పారిపోవడానికి యత్నిస్తే షూట్ చేయండి.. పోలీసులకు అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ హితవు..కానీ..