Pradeep Guha: చిత్ర పరిశ్రమలో విషాదం.. క్యాన్సర్‏తో ప్రదీప్ గుహ మృతి..

చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. మీడియా మొగల్ సినీ నిర్మాత ప్రదీప్ గుహ (60) తీవ్ర అనారోగ్యంతో కన్నుముశారు.

Pradeep Guha: చిత్ర పరిశ్రమలో విషాదం.. క్యాన్సర్‏తో ప్రదీప్ గుహ మృతి..
Pradeep Guha

Updated on: Aug 21, 2021 | 9:43 PM

చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. మీడియా మొగల్ సినీ నిర్మాత ప్రదీప్ గుహ (60) తీవ్ర అనారోగ్యంతో కన్నుముశారు. గత కొంత క్యాన్సర్‏తో భాదపడుతున్న ఆయనను ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేర్చారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ప్రదీప్ గుహ శనివారం తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూశారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు వెల్లడించారు. దీంతో ప్రదీప్ గుహ మరణంపై బీటౌన్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

అలాగే ప్రదీప్ గుహ మరణంపై బాలీవుడ్ నటులు మనోజ్ బాజ్ పేయి, సూభాష్ ఘాయ్, లారా దత్త సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం సంతాపం తెలియాజెస్తూ.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రదీప్ గుహ మరణ వార్త తనను ఒక్కసారిగా షాక్‏కు గురిచేసిందని.. తనకు చాలా బాధకలిగిందని.. ఆయన ఆత్మ ప్రశాంతంగా ఉండాలని మనోజ్ బాజ్ పాయ్ ట్వీట్ చేశారు.

ట్వీట్స్..

ఇక ప్రదీప్ గుహ ది టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ సంస్థకు గతంలో అధ్యక్షుడిగా పనిచేశారు. దాదాపు మూడు దశాబ్ధాలు ఆ సంస్థకు సీఈఓగా ఉన్నారు. ఆ తర్వాత 2005లో జీ టెలిఫిల్మ్ సంస్థకు సీఈఓగా పనిచేశాడు. ప్రస్తుతం 9ఎక్స్ మీడియాలో ఎండీగా చేస్తున్నాడు. అలాగే 2000లో ఫిజా, మిథున్ చక్రవర్తి, డింపుల్ కపాడియా నటించిన ఫిర్ కబి సినిమాను నిర్మించాడు.

Also Read: Anupama Onam Photos: అందానికే కన్ను కుట్టేలా ఉన్న అనుపమా పరమేశ్వరన్‌… నెట్టింట వైరల్‌ అవుతోన్న లేటెస్ట్‌ ఫొటోలు.

Nampally Exhibition: ఎగ్జిబిషన్ సొసైటీ చైర్మన్‌గా హరీశ్.. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉపాధి కల్పిద్దామని ప్రకటన

Spotify Survey: చిట్టికి ఫిదా అవుతోన్న హైదరాబాదీలు.. మ్యూజిక్‌ యాప్‌ స్పోటిఫై సర్వేలో ఆసక్తికర విషయాలు.