The Kashmir Files: ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాకు పన్ను మినహాయించండి.. కేంద్రానికి విజ్ఞప్తి చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి..

|

Mar 17, 2022 | 8:32 AM

ప్రధాని మోడీ మెచ్చిన ది కాశ్మీర్ పైల్స్ (The Kashmir Files ) చిత్రానికి పన్ను మినహాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు

The Kashmir Files: ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాకు పన్ను మినహాయించండి.. కేంద్రానికి విజ్ఞప్తి చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి..
The Kashmir Files
Follow us on

ప్రధాని మోడీ మెచ్చిన ది కాశ్మీర్ ఫైల్స్ (The Kashmir Files ) చిత్రానికి పన్ను మినహాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు ఛత్తీస్‏గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ (CM Bhupesh Baghel). ఈ సినిమాకు కేంద్ర జీఎస్టీ తొలగించి.. దేశవ్యాప్తంగా పన్ను రహితంగా మార్చాలని కోరారు.. విడుదలకు ముందే పలు వివాదాల్లో చిక్కుకుని రాజకీయంగా రిలీజ్ అడ్డంకులు ఎదుర్కొన్న ఈ సినిమాకు మద్దతు తెలిపిన మొదటి వామపక్ష పార్టీ వ్యక్తి ఇతనే కావడం గమనార్హం. ఈరోజు రాత్రి 8 గంటలకు రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు.. మంత్రులతో కలిసి సినిమా చూస్తానని సీఎం భూపేష్ బఘేల్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాను ప్రజలెవరు చూడకూడదని.. ఈ సినిమా టికెట్స్ అమ్మకూడదని థియేటర్లపై ఒత్తిడి తీసుకువచ్చిందని..అలాగే ఇందులోని పలు అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని ఆరోపణలు గుప్చించిందని.. బీజేపీ ఎమ్మెల్యే బ్రిజ్ మోహన్ ఆరోపించిన సంగతి తెలిసిందే.. అయితే ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు అవాస్తవాలని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. కాశ్మీర్ ఫైల్స్ పై పన్ను మినహాయించాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ చిత్రానికి జీఎస్టీ తొలగించాలని ప్రధానిని కోరుతున్నాను.. దేశవ్యాప్తంగా ఈ సినిమాను పన్ను మినహాయింపు ఉండాలంటూ ప్రధాని కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.

ఈరోజు గౌరవనీయులైన శాసనసభ సభ్యులందరూ (ప్రతిపక్షంలో ఉన్నవారితో సహా) కలిసి ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూడటానికి ఆహ్వానిస్తున్నాను.. ఈరోజు రాత్రి 8 గంటలకు రాజధానిలో థియేటర్లో అందరం కలిసి సినిమా చూద్దాం అంటూ ట్వీట్ చేశారు..

ఇదిలా ఉంటే.. మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. నిజాన్ని చూపించే సినిమాను.. అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు.. ఈ సినిమాను ప్రతి ఒక్కరు చూడాలని కోరారు.. డైరెక్టర్ అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1990లో కాశ్మీరి పండిట్‏లపై జరిగిన అకృత్యాలను చూపించారు..దీంతో అక్కడున్న ప్రజలు రాత్రికి రాత్రే ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇలాంటి సన్నివేశాలను ఈ సినిమాలో హైలెట్ చేసి చూపించారు..

Also Read: The Kashmir Files: సంచలనం సృష్టిస్తున్న ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా…?

Krithi Shetty: బంపరాఫర్‌ కొట్టేసిన కృతిశెట్టి.. ఏకంగా పాన్‌ ఇండియా స్టార్‌కు జోడిగా..?

Viral Photo: కల్లు తాగుతున్న ఈ తెలుగు బ్యూటీ ఎవరో గుర్తించగలరా..?.. చాలా ఈజీనే

RRR Movie: రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లను ఎలా బ్యాలెన్స్‌ చేశారు.? ఆసక్తికర విషయాలు వెల్లడించిన జక్కన్న..