హిందీ ఛానల్ స్టార్ ప్లస్‌లో ప్రసారమయ్యే పాండ్యా స్టోర్ సెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సెట్లో కొంత భాగం మంటల్లో కాలిపోయింది. అయితే సంఘటన జరిగిన సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ పాండ్యా స్టోర్ సెట్ ముంబైలోని గోరేగావ్‌లోని ఫిల్మ్ సిటీలో ఉంది. అయితే ఇందులో ఎలాంటి ప్రాణం నష్టం జరగలేదు కానీ.. కొన్ని కోట్లలో నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది.
ఈ కార్యక్రమంలో కిన్షుక్ తల్లి సుమన్ పాండ్యాగా నటిస్తున్న నటి కృతికా దేశాయ్ మొదట సోషల్ మీడియాలో ఈ అగ్ని ప్రమాద వీడియోను పోస్ట్ చేసింది.. తర్వాత వెంటనే డిలిట్ చేసింది. సంజయ్ వాద్వా, కోమల్ సంజయ్ వాద్వా నిర్మాణంలో స్టార్ ప్లస్ ఛానల్‌లో జనవరి 25 నుంచి ‘పాండ్యా స్టోర్’ అనే టీవీ షో ప్రసారం మొదలైంది. షైనీ దోషి, కిన్షిక్ మహాజన్ పాత్రధారులుగా ఈ షో ప్రారంభమైంది. ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే మంచి గుర్తింపు వచ్చింది. తమిళంలో వచ్చిన పాండ్యాన్ స్టోరీస్‌ను రీమేక్ చేస్తూ ‘పాండ్యా స్టోరీ’ చేస్తున్నారు.
ఇక ఈ ప్రమాదానికి సంబంధించి.. షో నిర్మాతలు ఒక ప్రకటన విడుదల చేశారు. షో ప్యాక్ అప్ అయిన తర్వాత సెట్లో కొంతభాగం మంటలు చెలరేగాయని వారు పేర్కోన్నారు. పాండ్యా స్టోర్ షో యొక్క సెట్లో ఒక భాగంకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఎంత నష్టం జరిగిందో తెలియలేదు. దీని వలన షోకు ఎలాంటి అంతరాయం కలగుకుండా చూసుకుంటాం. నటీనటులు మరియు సిబ్బందితోపాటు అందరూ సురక్షితంగా ఉన్నారు.. త్వరలో ఈ షో తిరిగి ప్రారంభమవుతుంది అని తెలిపారు.
ప్రముఖ టీవీ షో సెట్లో అగ్రిప్రమాదం..
The sets of Pandya Store caught fire ? Thank God no one was shooting there when this unfortunate incident took place but major parts of the sets are damaged, as per the reports ? #KinshukMahajan #ShinyDoshi #PandyaStore #FilmCity #ItsEZone
•
•
•
•
Follow ? @its_ezone ? pic.twitter.com/kjIUe7xeH0— ItsEZone (@Its_EZone) February 20, 2021
Also Read:
Hero Surya : కరోనాను జయించిన స్టార్ హీరో సూర్య.. ఆనందం వ్యక్తం చేస్తున్న అభిమానులు..