
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్‌గా ఎదిగారు. దేశవ్యా్ప్తంగానే కాదు.. వరల్డ్ వైడ్‌గా షారుఖ్ అంటే పడిచచ్చే అభిమానులున్నారు. ఆయన సినిమా వస్తుందంటే థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ చేసే రచ్చ గురించి తెలిసిందే. ఇక షారుఖ్ బర్త్ డే వస్తే.. వేలాది మంది జనం ఆయన ఇంటిముందు వాలిపోతుంటారు అంటే జనాల్లో ఆయనకు ఉండే క్రేజ్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. రిలేషన్ షిప్స్.. లవ్ ఎఫైర్స్ అంటూ ఎలాంటి గాసిప్స్ లేని హీరో కూడా షారుఖ్ కావడం విశేషం. బాద్ షాగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న షారుఖ్ గురించి ఇప్పటివరకు ఎలాంటి లవ్ రూమర్స్ క్రియేట్ కాలేదంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే షారుఖ్ జీవితంలో ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అతని భార్య గౌరీ ఉందన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి లవ్ స్టోరీ మాత్రం సినిమా కథను తలపిస్తోంది. ఎంతటి స్టా్ర్ అయిన.. వ్యక్తిగత జీవితంలో ప్రేమ, పెళ్లి కోసం ఎక్కువగానే కష్టపడాల్సి వచ్చింది.
షారుఖ్ ఖాన్ తో పెళ్లికి తన పేరెంట్స్ అంత ఈజీగా ఒప్పుకోలేదని.. చాలా పట్టుబట్టి ఒత్తిడి తీసుకువస్తే తమ తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించారని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు గౌరీ ఖాన్. గౌరీ ఖాన్ మాట్లాడుతూ.. “మా పెళ్లి జరిగే సమయానికి షారుఖ్ వయసు 26. నా వయసు 21 సంవత్సరాలు. ఒకటి కాదు.. రెండు కాదు.. మేము ఏకంగా మూడు సార్లు పెళ్లి చేసుకున్నామంటే నమ్మడానికి చాలా కష్టంగా ఉంటుంది.” అంటూ చెప్పుకొచ్చింది. ఢిల్లీలోని కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ముందుగా షారుఖ్.. గౌరీకి తన ప్రేమ విషయాన్ని తెలియజేశాడట. ఆ తర్వాత కొద్ది రోజులకు గౌరీ ఖాన్ ఓకే చేసిందట. ఆరేళ్లపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు 1991 అక్టోబర్ 25న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరికి సుహాన ఖాన్, ఆర్యన్ ఖాన్ ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Shah Rukh, Gouri
హీరో కాకముందు టెలివిజన్ రంగంలో షారుఖ్ పనిచేస్తున్న సమయంలోనే అతనికి గౌరీ అండగా ఉందట. అప్పట్లో గౌరీ.. షారుఖ్ కు ఆర్థికంగా ఎంతో సాయం చేసిందట. ఆ తర్వాత హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన షారుఖ్.. వరుస హిట్స్ అందుకుని.. అతి తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తుండగా.. విజయ్ సేతుపతి కీలకపాత్రలో కనిపించనున్నారు.