ఒక చీటింగ్ కేసులో ప్రముఖ బాలీవుడ్ నటి జరీన్ ఖాన్‌పై ఇటీవల అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఇప్పుడు అదే కేసుకు సంబంధించి నటికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. డిసెంబర్ 26 వరకు నటిని అరెస్ట్ చేయరాదని కోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. 2018లో కోల్‌కతాలో జరిగిన దుర్గా పూజ కార్యక్రమంలో నటి జరీన్ ఖాన్ అతిథిగా పాల్గొనాల్సి ఉంది. అయితే జరీన్ ఖాన్ ఎటువంటి కారణం లేకుండా ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టింది. దీంతో కార్యక్రమ నిర్వాహకులకు భారీగా నష్టం వాటిల్లింది. దీంతో వారు జరీన్‌ఖాన్‌పై పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదు చేశాడు. నటిపై ఎఫ్ఐఆర్ కూడా దాఖలైంది. తనపై నమోదైన చీటింగ్ కేసుపై స్పందించిన జరీన్ ఖాన్.. నిర్వాహకులు తనకు తప్పుడు సమాచారం ఇచ్చారని తెలిపింది.. కార్యక్రమానికి వీఐపీ అతిథులు వస్తారని, సీఎం మమతా బెనర్జీ వస్తారని అబద్ధం చెప్పారు. అలాగే నా ఫ్లైట్, బస ఏర్పాట్లు సరిగా చేయలేదని, అందుకే ప్రోగ్రామ్ కి రాలేదన్నారు. ఈ కేసును విచారించిన కోర్టు 2023 సెప్టెంబర్‌లో జరీన్ ఖాన్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇప్పుడు నటికి బెయిల్ వచ్చింది. అయితే ఆ నటి విదేశాలకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. అంతేకాకుండా 30 వేల రూపాయల సెక్యూరిటీ బాండ్‌ను కూడా సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
హిందీతో సహా తెలుగు, తమిళ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి జరీనా ఖాన్. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన వీర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందామె. వీర్, హౌస్‌ఫుల్ 2, హేట్ స్టోరీ, వీరప్పన్, అక్సర్ 2, 1921, ఢాకా, వంటి హిందీ, పంజాబీ సినిమాల్లో నటించింది. తెలుగులో గోపీచంద్ సరసన చాణక్య సినిమాలో మెరిసింది. అయితే పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం హమ్ బీ అఖేలే, తుమ్ బీ అఖేలే అనే హిందీ సినిమాలో నటిస్తోందీ అందాల తార.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..