Kangana Ranaut: హైదరాబాద్‏లో కంగనా రనౌత్ పై కేసు నమోదు.. ఎందుకు చేశారంటే..

|

Nov 14, 2021 | 9:12 AM

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఇప్పటికే పలుమార్లు ఆమె మాట తీరుపై నెటిజన్లు

Kangana Ranaut: హైదరాబాద్‏లో కంగనా రనౌత్ పై కేసు నమోదు.. ఎందుకు చేశారంటే..
ఈ స్టార్ హీరోలు భారతీయ సంస్కృతిలో లోతుగా పాతుకుపోయారు. ఆ హీరోలు తమ కుటుంబాలను ప్రేమిస్తారు, సంబంధాల విషయంలో వెస్టర్న్ దేశాలను అనుకరించకుండా, వాటిని నిలుపుకుంటారు. వారి వృత్తి నైపుణ్యం, అభిరుచి అసమానమైనది అంటూ రాసుకొచ్చారు కంగానా..
Follow us on

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఇప్పటికే పలుమార్లు ఆమె మాట తీరుపై నెటిజన్లు మాత్రమే కాకుండా.. సినీ రాజకీయ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించిన కంగానాకు వివాదాలు కొత్తేం కాదు.. అయితే ఎప్పుడూ సినీ, రాజకీయ ప్రముఖులను ట్యాగ్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసే కంగానా.. ఈసారి దేశం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. భారత్‏కు నిజమైన స్వాతంత్రం 2014లో వచ్చందని.. 1947లో వచ్చింది బిక్ష మాత్రమేనని కంగానా తెలిపింది. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగుతోంది. స్వాతంత్ర సమరయోధులను అవమానించిన కంగనను అరెస్ట్ చేయాలని.. వెంటనే ఆమెకు ఇచ్చిన పద్మ శ్రీని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే జనాలు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసిన కంగానా మాత్రం తగ్గలేదు. మరోసారి తన మాటలను సమర్దించుకుంది. అయితే కంగానా వ్యాఖ్యలపై దేశంలోని పలుచోట్ల ఆమెపై కేసులు నమోదయ్యాయి. తాజాగా హైదరాబాద్‏లోనూ కేసు నమోదైంది.

దేశస్వాంతంత్రం గురించి అవమానకరంగా మాట్లాడారంటూ కంగానాపై తెలంగామ శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్ కేసు నమోదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 1947లో మనకు వచ్చింది భిక్ష మాత్మే.. 2014లోనే అసలైన స్వాతంత్రం వచ్చిందని కంగనా అంటున్నారు. ఒక భారతీయురాలు అయ్యుండి ఇలా మాట్లాడటం ఏంటీ ? కంగనా పిచ్చికూతలు మానుకోవాలి. ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలి.. ఆమెకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలన్నారు. కేవలం హైదరాబాద్‏లోనే కాకుండా.. కంగానాపై డిల్లీ, ముంబై, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. రెండు రోజుల కిందట ఓ జాతీయ మీడియా నిర్వహించిన సమావేశంలో కంగానా మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రం గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతుంది. అయితే తనపై వస్తున్న నిరసనలకు.. డిమాండ్స్ పై కంగానా స్పందించింది. ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లయితే ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డును తానే తిరిగి ఇచ్చేస్తానని తెలిపింది.

Also Read: God Father: గాడ్ ఫాదర్ కోసం రంగంలోకి బాలీవుడ్ స్టార్.. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కీలకపాత్రలో..

Petrol Diesel Prices: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉందో తెలుసా..

Mumbai Vaccination: కరోనా టీకాలు వేయడంలో రికార్డు సాధించిన ముంబయి.. అక్కడ అందరికీ మొదటి డోసు పూర్తి!