Aryan Khan drugs case: సమీర్ వాంఖడేకి షాక్.. అవినీతి ఆరోపణలతో ఆర్యన్ ఖాన్ కేసు నుంచి ఔట్.! (వీడియో)

Aryan Khan drugs case: సమీర్ వాంఖడేకి షాక్.. అవినీతి ఆరోపణలతో ఆర్యన్ ఖాన్ కేసు నుంచి ఔట్.! (వీడియో)

Anil kumar poka

|

Updated on: Nov 14, 2021 | 9:15 AM

షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు నుంచి సమీర్ వాంఖడేను ఎన్‌సీబీ తప్పించింది. ఆయనను ఈ కేసు నుంచి తప్పించినా.. ముంబయి జోనల్ అధికారిగా కొనసాగుతారని స్పష్టం చేసింది. అవినీతి ఆరోపణలు రావడంతోనే సమీర్ వాంఖడేను తప్పించినట్టు తెలుస్తోంది.


షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు నుంచి సమీర్ వాంఖడేను ఎన్‌సీబీ తప్పించింది. ఆయనను ఈ కేసు నుంచి తప్పించినా.. ముంబయి జోనల్ అధికారిగా కొనసాగుతారని స్పష్టం చేసింది. అవినీతి ఆరోపణలు రావడంతోనే సమీర్ వాంఖడేను తప్పించినట్టు తెలుస్తోంది. ఆర్యన్ సహా మరో ఆరు కేసుల నుంచి ఆయనను తప్పించారు. ఈ మొత్తం కేసుల విచారణను సీనియర్ పోలీస్ అధికారి సంజయ్ సింగ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం చేపట్టనుంది. వీటిలో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అల్లుడి డ్రగ్స్ కేసు కూడా ఉంది.

ఈ కేసుల్ని విచారించడానికి ఎన్‌సీబీ సీనియర్‌ అధికారి సంజయ్‌ సింగ్‌ ఆధ్వర్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందంను ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్‌ మాలిక్‌ అల్లుడు సమీర్‌ ఖాన్, నటుడు అర్మాన్‌ కొహ్లి కేసులు కూడా ఇందులో ఉన్నాయి. డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ ఖాన్‌ను విడిచిపెట్టడానికి 25కోట్లకు డీల్‌ కుదిరిందని అందులో వాంఖెడే వాటా 8 కోట్లు అంటూ ఈ కేసులో సాక్షి ప్రభాకర్‌ సాయిల్‌ ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. దీనిపై వాంఖెడేపై శాఖాపరమైన దర్యాప్తు కూడా కొనసాగుతోంది. ఇక మంత్రి నవాబ్‌ మాలిక్‌ అడుగడుగునా వాంఖెడేపై ఆరోపణలు చేయడంతో ఈ కేసు రాజకీయ రంగు పులుముకుంది.

ఎన్‌సీబీ మాత్రం డ్రగ్స్‌ కేసులో జాతీయ, అంతర్జాతీయ ముఠా హస్తం ఉందని, దీనిపై లోతుగా విచారించడం కోసమే సిట్‌ ఏర్పాటు చేసినట్టుగా తెలిపింది. వాంఖెడే ముంబై జోనల్‌ డీజీగా కొనసాగుతారని స్పష్టం చేసింది. ఇలా ఉండగా ఆర్యన్‌ ఖాన్‌ ఈనెల 5న ఎన్‌సీబీ కార్యాలయానికి వెళ్లి హాజరు వేయించుకున్నాడు. బాంబే హైకోర్టు ఆర్యన్‌కు బెయిల్‌ ఇస్తూ ప్రతీ శుక్రవారం ఎన్‌సీబీ కార్యాలయానికి వ్యక్తిగతంగా హాజరుకావాలని షరతు విధించింది. బెయిల్‌ వచ్చి న తర్వాత తొలిసారి ఎన్‌సీబీ కార్యాలయానికి ఆర్యన్‌ వచ్చాడు.

మరిన్ని చూడండి ఇక్కడ: Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Ram Charan look in RRR: ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్.. సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్న ఫొటోస్…

Sreeleela: ఎట్రాక్ట్ చేస్తున్న అందాల చందమామ శ్రీలీల లేటెస్ట్ ఫోటోస్…