Tollywood: ఒకప్పుడు అబ్బాయిల డ్రీమ్ గర్ల్.. ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. ఆ అందమైన అమ్మాయి ఎవరో గుర్తించగలరా..?

|

Jun 07, 2024 | 3:59 PM

1970 -1980 మధ్య కాలంలో అందమైన రూపం.. కలువు కన్నులు.. చక్కటి చిరునవ్వుతో ఎంతో మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న కలల సుందరి. నాట్యమయూరిగా.. కథానాయికగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్.. ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్‏గా ఉంటుంది. 2024 లోకసభ ఎన్నికల్లో విజయం సాధించింది. ఇంతకీ ఆ అందమైన అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..?

Tollywood: ఒకప్పుడు అబ్బాయిల డ్రీమ్ గర్ల్.. ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. ఆ అందమైన అమ్మాయి ఎవరో గుర్తించగలరా..?
Actress 1
Follow us on

సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్, వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలకు చెందిన పలువురు నటీనటుల చిన్ననాటి పిక్స్, కాలేజీ డేస్ ఫోటోస్ చూసేందుకు నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఒకప్పటి అబ్బాయిల డ్రీమ్ గర్ల్ త్రోబ్యాక్ వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 1970 -1980 మధ్య కాలంలో అందమైన రూపం.. కలువు కన్నులు.. చక్కటి చిరునవ్వుతో ఎంతో మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న కలల సుందరి. నాట్యమయూరిగా.. కథానాయికగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్.. ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్‏గా ఉంటుంది. 2024 లోకసభ ఎన్నికల్లో విజయం సాధించింది. ఇంతకీ ఆ అందమైన అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..? చూడగానే కట్టిపడేసే చక్కటి చిరునవ్వుతో హృదయాలను దొచేస్తోన్న ఆ అమ్మాయి మరెవరో కాదు..బాలీవుడ్ హీరోయిన్ హేమమాలిని.

70’s, 80’sలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో ఇండస్ట్రీని షేక్ చేసింది. హిందీలో అనేక సినిమాల్లో నటించిన హేమమాలిని.. ఇప్పుడు 2024 లోక్‌సభ ఎన్నికల్లో మథుర నుంచి బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ హేమమాలిని విజయం సాధించారు. తాజాగా హేమమాలినికి సంబంధించిన త్రోబ్యాక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. తాజాగా నెట్టింట వైరల్ గా మారిన వీడియో దాదాపు 20, 30 ఏళ్ల క్రితం నాటిదని అర్థమవుతుంది. భరతనాట్యం కళాకారిణి అయిన హేమ మాలిని 75 ఏళ్ల వయసులో కూడా లైవ్ షోలలో డ్యాన్స్ చేస్తూనే ఉంది.

తాను ఎప్పటికీ శాస్త్రీయ నృత్యానికే అంకితమని.. అంతటి గొప్ప అవకాశం తనకు ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు హేమమాలిని. ఆరు దశాబ్దాల కెరీర్‌లో 200కి పైగా సినిమాల్లో నటించింది. అలాగే దర్శకురాలిగానూ గుర్తింపు తెచ్చుకుంది. షారుఖ్ ఖాన్ నటించిన దిల్ అష్నా హై (1992) , ల్ మీ ఓ ఖుదా (2011) చిత్రాలకు దర్శకత్వం వహించింది. చివరగా 2020లో రిలీజ్ అయిన రొమాన్స్ డ్రామ సిమ్లా మిర్చి చిత్రంలో కనిపించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.