దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది ముంబై డ్రగ్స్ కేసు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్‌ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఉండటం మరింత దుమారం రేపుతోంది. అసలు వీరికి ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి..? ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి అన్న కోణంలో విచారిస్తున్నారు ఎన్సీబీ అధికారులు. క్రూయిజ్‌లో షారూఖ్ ఖాన్ కుమారుడితో పాటు ఇంకా చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారని.. కానీ వారెవరూ డ్రగ్స్ తీసుకోలేదని ఎన్సీబీ అధికారులు తెలిపారు. డ్రగ్స్ మత్తులో ఉన్న 8 మందిని మాత్రమే అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) శనివారం సాయంత్రం ముంబై నుండి గోవా వెళ్తున్న క్రూయిజ్‌పై దాడి చేసి డ్రగ్స్ పార్టీ చేస్తున్న చాలా మందిని అరెస్టు చేసింది. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.
ఎన్‌సీబీ ముంబై డైరెక్టర్ సమీర్ వాంఖడే ముంబై తీరంలో జరిగిన రేవ్ పార్టీలో జరిగిన దాడిలో ఆర్యన్ ఖాన్ (షారూఖ్ కుమారుడు) తో పాటు అర్బాజ్ మర్చంట్ మున్మున్ ధమేచా, నూపుర్ సారిక అనే ఎనిమిది మంది పట్టుబడినట్లుగా సమాచారం. ఇస్మీత్ సింగ్, మోహక్ జస్వాల్, విక్రాంత్ చోకర్, గోమిత్ చోప్రాను ఎన్‌సీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ 24 ఏళ్ల కుమారుడి ఆర్యన్ ఖాన్ బాలీవుడ్‌లో అరంగేట్రం చేయక ముందే వివాదాల్లో చిక్కుకున్నాడు. ఎన్‌సీబీ షారుఖ్ కుమారుడిని అదుపులో విచారిస్తోంది. ఆర్యన్ ఖాన్ తాను ఈ పార్టీలో భాగమని ఒప్పుకున్నట్లు చెబుతున్నారు. తాను కూడా తప్పు చేశానని ఒప్పుకున్నాడు. రేవ్ పార్టీకి ముందు నుంచే షారుఖాన్ కుమారులు వివాదాలలో చిక్కుకున్నారు.
గత కొద్ది రోజుల క్రితం ఓ ఎంఎంఎస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో ఓ అమ్మాయి ఓ అబ్బాయితో చాలా క్లోజ్‌గా కనిపిస్తుంది. ఆ సమయంలో కూడా ఆర్యన్ పేరు వినిపించింది. అయితే ఆ తర్వాత ఇది ఫేక్ వీడియో అని తేలింది. ఇలా ప్రతిసారి ఆర్యన్ పేరు వినిపించడం బీ టౌన్‌లో పెద్ద సంచలనం.
సోషల్ మీడియాలో ఇతని ఫోటోలు చాలా సార్లు వైరల్ అవుతుంటాయి. అందులోనూ అమ్మాయిలతో చాలా సన్నిహితంగా ఉండేవి.. వీటితోపాటు ఆర్యన్ త్వరలో బాలీవుడ్‌లో అరంగేట్రం చేయబోతున్నాడని చాలా కాలంగా వార్తల్లో ఉంటాయి.
షారుఖ్ కుమారుడు ఆర్యన్ కబీ ఖుషి కభీ ఘమ్‌లో కింగ్ ఖాన్ చిన్ననాటి పాత్రను పోషించాడు. అతను ది ఇన్క్రెడిబుల్స్ (హమ్ హేన్ లాజావాబ్ 2004) , ది లయన్ కింగ్ (2019) వంటి సినిమాలకు కూడా తన గాత్రాన్ని అందించాడు. దీని కోసం ఆర్యన్ ఉత్తమ డబ్బింగ్ చైల్డ్ వాయిస్ ఆర్టిస్ట్ (మగ) అవార్డును కూడా అందుకున్నాడు. దీనితో పాటు ఆర్యన్ సినిమా నిర్మాణం, దర్శకత్వంపై ఆసక్తి కలిగి ఉండటం విశేషం. ఆర్యన్ సినిమాతోపాటు క్రీడల్లోనూ ప్రావీణ్యం ఉంది. 2010లో జరిగిన తైక్వాండో పోటీలో గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు.
ఇవి కూడా చదవండి: Maharashtra NCB Raid: వీకెండ్ మత్తు మజాలో వాణిజ్య నగరం.. పట్టుబడిన బాలీవుడ్ స్టార్ హీరో పుత్రరత్నం..