Lata Mangeshkar: ఈరోజు లతాజీ అస్థికలను నాసిక్ లోని పవిత్ర రామకుండ్‌ లో నిమజ్జనం చేసిన ఆదినాథ్ మంగేష్కర్,ఆశా భోస్లే..

| Edited By: Ravi Kiran

Feb 10, 2022 | 5:12 PM

Lata Mangeshkar: లెజండరీ సింగర్, భారత గాన కోకిల లతా మంగేష్కర్ అస్థికలను గోదావరి(Godavari) నదీ తీరంలోని నాసిక్ (Nasik) వద్ద  పవిత్ర రామకుండ్‌(Ramkud)లో గురువారం నిమజ్జనం చేశారు.హిందూ సంప్రదాయం..

Lata Mangeshkar: ఈరోజు లతాజీ అస్థికలను నాసిక్ లోని పవిత్ర రామకుండ్‌ లో నిమజ్జనం చేసిన ఆదినాథ్ మంగేష్కర్,ఆశా భోస్లే..
Follow us on

Lata Mangeshkar: లెజండరీ సింగర్, భారత గాన కోకిల లతా మంగేష్కర్ అస్థికలను గోదావరి(Godavari) నదీ తీరంలోని నాసిక్ (Nasik) వద్ద  పవిత్ర రామకుండ్‌(Ramkud)లో గురువారం నిమజ్జనం చేశారు.హిందూ సంప్రదాయం ప్రకారం ఈ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో పూజారులు ,కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు హాజరయ్యారు. లతా మంగేష్కర్ అస్థికలను, చితాభస్మాన్ని పవిత్ర రామకుండ్‌లో నిమజ్జనం చేసిన అనంతరం అక్కడ లతాజీకి పుణ్యలోకాలు కలగాలని కోరుతూ ప్రార్ధన చేశారు. ఈ పవిత్ర కుండ్ లో శ్రీరాముడు వనవాస సమయంలో రోజూ స్నానం చేసేవాడని అంటారు.

హిందూ సంప్రదాయం ప్రకారం జరిపిన ఈ వేడుకలకు లతా మంగేష్కర్ మేనల్లుడు ఆదినాథ్ మంగేష్కర్,ఆశా భోస్లే  కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ రోజు ఉదయం భారతరత్న లతా మంగేష్కర్ అస్థికలను కుటుంబ సభ్యులు నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమం చూడడానికి లత మంజేస్కర్ కు నివాళి అర్పించేందుకు భారీగా జనం తరలి రావడంతో నాసిక్ పోలీసు యంత్రాంగం గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది.

లతా దీదీ అంటూ ఆమెను అందరూ ముద్దుగా పిలుచుకునేవారు. అనారోగ్యంతో బాధపడుతూ.. చికిత్స తీసుకుంటున్న లతాజీ ఫిబ్రవరి 6న బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో మరణించారు. అదే రోజు సాయంత్రం లతా మంగేష్కర్ కు ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, వివిధ కేంద్ర, రాష్ట్ర కేబినెట్ మంత్రులు, బాలీవుడ్ ప్రముఖులు తదితరులతో పాటు వేలాది మంది ఆమె అభిమానుల సమక్షంలో ప్రభుత్వ లాంఛనాలతో శివాజీ పార్క్ వద్ద బహిరంగంగా అంత్యక్రియలు నిర్వహించారు. మర్నాడు లతాజీ చితాభస్మాన్ని , అస్థికలను మేనల్లుడు ఆదినాథ్ మంగేష్కర్ ‘సేకరించి రాగి పాత్రలో భద్ర పరిచారు. ఈరోజు పవిత్ర రామకుండ్ లో వాటిని నిమజ్జనం చేశారు. ఇదే ప్రాంతంలో గతంలో జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, వై.బి.చవాన్ వంటి పలువురు నేతల అస్థికలను ఇదే పవిత్ర స్థలంలో నిమజ్జనం చేశారు.

Also Read:  శ్రీవల్లి సాంగ్ లోని అల్లు అర్జున్ హుక్ స్టెప్ ని అనుకరించిన రాను మండల్.. వద్దు బాబోయ్ అంటున్న నెటిజన్లు..