
భారత క్రికెటర్ శిఖర్ ధావన్ ప్రస్తుతం తన వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలిచాడు.. శిఖర్ ధావన్ భార్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అదేవిధంగా తన కుమారుడు జోరావర్‌ను కలవలేకపోయానని సోషల్‌మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు శిఖర్ ధావన్. తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా శిఖర్ ధావన్ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. ఈ పోస్ట్‌లో, అతను చాలా కాలం నుండి కొడుకును చూడలేదని పేర్కొన్నాడు. ఇప్పుడు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ శిఖర్ కోసం ప్రత్యేక పోస్ట్ షేర్ చేశాడు. లక్షలాది మంది ప్రజలు నీ కోసం, నీ కొడుకు కోసం ప్రార్థిస్తున్నారని అక్షయ్ ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు.
అక్షయ్ కుమార్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో శిఖర్ ధావన్, అతని కొడుకు ఫోటోను పోస్ట్ చేశారు. ‘ఈ పోస్ట్ చూసిన తర్వాత నేను నిజంగా భావోద్వేగానికి గురయ్యాను. ఒక తండ్రి అయినందున, మీ బిడ్డను కలవలేకపోయిన బాధ అన్ని బాధలకంటే పెద్దదని నాకు బాగా తెలుసు. ధైర్యంగా ఉండండి. మీరు మీ కొడుకును కలవాలని లక్షలాది మంది ప్రార్థిస్తున్నాము. దేవుడు ఆశీర్వదిస్తాడు’ అని రాసుకొచ్చారు అక్షయ్.
భార్య అయేషాతో విడాకులు తీసుకున్న తర్వాత, ఆమె అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి శిఖర్‌ను బ్లాక్ చేసింది. దాంతో శిఖర్ తన కుమారుడిని కలవలేక, చూడలేకపోతున్నాడు. “నేను నిన్ను చూసి ఒక సంవత్సరం అయ్యింది , గత మూడు నెలలుగా నేను ఎక్కడి నుండైనా బ్లాగు చేస్తున్నాను. దీని కోసం నేను మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి అదే ఫోటోను ఉపయోగిస్తున్నాను. నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నేను మిమ్మల్ని నేరుగా కలవలేను కానీ నేను టెలిపతి ద్వారా మీతో కనెక్ట్ అయ్యాను. నేను మీ గురించి గర్వపడుతున్నాను, మీరు బాగుంటారని నాకు తెలుసు. తప్పకుండా మీరు ముందుకు సాగుతారు” అని రాసుకొచ్చాడు.
శిఖర్ ధావన్ 2012లో అయేషా ముఖర్జీని పెళ్లాడాడు. ఆయేషా మొదట ఆస్ట్రేలియాకు చెందిన పారిశ్రామికవేత్తను వివాహం చేసుకుంది. వీరికి అలియా, రియా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆ అమ్మాయిలను అంగీకరించిన శిఖర్ అయేషాను పెళ్లి చేసుకున్నాడు. ఆయేషా, శిఖర్ దంపతులకు జోరావర్ అనే కుమారుడు ఉన్నాడు. అయేషా, శిఖర్ అక్టోబర్ 4 2023న విడాకులు తీసుకున్నారు. అయితే పిల్లల సంరక్షణ విషయంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
శిఖర్ ధావన్ ఇన్ స్టా
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.