Coronavirus: సినిమా ఇండస్ట్రీలో కరోనా ప్రకంపనలు.. రెండోసారి వైరస్‌కు చిక్కిన స్టార్‌ కమెడియన్‌..

|

Jun 16, 2022 | 8:42 AM

Comedian VirDas: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళతో పాటు పలు రాష్ట్రాల్లో రోజువారీ కేసుల్లో పెరుగుదల కన్పి్స్తోంది. ఇక ముంబైలో అయితే ఇబ్బడిముబ్బడిగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి...

Coronavirus: సినిమా ఇండస్ట్రీలో కరోనా ప్రకంపనలు.. రెండోసారి వైరస్‌కు చిక్కిన స్టార్‌ కమెడియన్‌..
Vir Das
Follow us on

Comedian VirDas: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళతో పాటు పలు రాష్ట్రాల్లో రోజువారీ కేసుల్లో పెరుగుదల కన్పి్స్తోంది. ఇక ముంబైలో అయితే ఇబ్బడిముబ్బడిగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కాగా బాలీవుడ్‌లోనూ కరోనా ప్రకంపనలు రేపుతోంది. బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌, కత్రీనా కైఫ్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా నటుడు, స్టార్‌ కమెడియన్‌ వీర్‌ దాస్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. కాగా ఆయనకు కరోనా సోకడం ఇది రెండోసారి.ఇంతకు ముందు ఈ ఏడాది జనవరిలో వీర్‌దాస్‌ మహమ్మారి బారిన పడ్డాడు.

ఫ్యాన్స్‌కు క్షమాపణలు..

ప్రస్తుతం గుజరాత్‌లో ఉన్నాడు దాస్. కాగా తన కామెడీ షోలు వాయిదా పడటంతో అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. త్వరలోనే తన కామెడీ షోల తేదీలను ప్రకటిస్తానని పేర్కొన్నాడు. ‘క్షమించండి గుజరాత్‌. నేను ఈ విషయం గురించి చాలా చింతిస్తున్నాను. కానీ త్వరలోనే మిమ్మల్ని లైవ్‌లో చూడాలని కోరుకుంటున్నాను. మీరు కొత్త తేదీలలో షోకు తిరిగి వస్తారని ఆశిస్తున్నాను’ అని వీర్‌దాస్‌ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..