Swara Bhaskar: పొలిటికల్ లీడర్‏ను సీక్రెట్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. అతనెవరంటే..

సమాజ్ వాదీ పార్టీ మహారాష్ట్ర యువజన విభాగం అయిన సమాజ్ వాదీ యువజన్ సభ రాష్ట్ర అధ్యక్షుడు ఫహద్ అహ్మద్. ఇరువురి కుటుంబసభ్యులు.. అతి కొద్ది మంది సన్నిహితులు.. స్నేహితుల మధ్య వీరిద్దరి పెళ్లి జరిగింది.

Swara Bhaskar: పొలిటికల్ లీడర్‏ను సీక్రెట్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. అతనెవరంటే..
Swara Bhaskar

Updated on: Feb 17, 2023 | 7:14 AM

బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ ఎట్టకేలకు వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన స్నేహితుడు ఫహద్ అహ్మద్‎ను సీక్రెట్‏గా పెళ్లి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే తన పెళ్లి గురించిన విషయాలను ఆలస్యంగా బయటపెట్టింది స్వర. తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఫిబ్రవరి 16న సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తన వివాహన్ని అధికారికంగా ప్రకటించింది. అలాగే తన భర్తతో ఏర్పడిన పరిచయం నుంచి పెళ్లి వరకు సాగిన జర్నీని ఓ షార్ట్ వీడియో ద్వారా అభిమానులతో పంచుకుంది. స్వర పెళ్లాడిన వ్యక్తి పొలిటికల్ లీడర్. సమాజ్ వాదీ పార్టీ మహారాష్ట్ర యువజన విభాగం అయిన సమాజ్ వాదీ యువజన్ సభ రాష్ట్ర అధ్యక్షుడు ఫహద్ అహ్మద్. ఇరువురి కుటుంబసభ్యులు.. అతి కొద్ది మంది సన్నిహితులు.. స్నేహితుల మధ్య వీరిద్దరి పెళ్లి జరిగింది.

గత నెల జనవరి 6న వీరిద్దరి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు ఆమె తెలిపింది. ప్రేమను వెతికినప్పుడు మొదట స్నేహం ఎదురవుతుంది. ఆ తర్వాతే అది ప్రేమతో పూర్తవుతుంది. ఈ ప్రయాణంలో ఒకరినొకరం తెలుసుకున్నాం. చివరగా నాకు ప్రేమ దొరికింది. వెల్ కమ్ టూ మై హార్ట్ ఫహద్ అంటూ రాసుకొచ్చింది. స్వర భాస్కర్ తన భావాలను ధైర్యంగా వ్యక్తపరిచే అమ్మాయి. ఇప్పటికే తాను చెప్పాలనుకున్న విషయాలను సూటిగా ట్వీట్టర్ వేదికగా షేర్ చేస్తుంది. 2019 పౌరసత్వ సవరణ చట్టంపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేసింది. ఆ తర్వాత అనేక ర్యాలీలలో పాల్గొంది. ఆ నిరసన సమయంలోనే ఆమెకు ఫహద్ తో పరిచయం ఏర్పడినట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇక ఫహద్ రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉంటాడు. కేంద్ర ప్రభుత్వ పోస్ట్ మెట్రిక్యులేషన్ స్కాలర్‌షిప్‌కు అర్హులైన షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని ఉపసంహరించుకోవాలని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) 2018లో నిర్ణయించింది. దీంతో స్టూడెంట్స్ యూనియన్ సమ్మెకు పిలుపునిచ్చింది. అందులో ఫహద్ ముందున్నాడు. కాలేజీ సమయం నుంచే ఫహద్ రాజకీయాలపై ఆసక్తిని పెంచుకున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.